శ్రీశైలం,(అక్షర ప్రళయం)

శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున భ్రమరాంబికా దేవి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 23వ తేదీన కళారాధనలో శ్రీశైల దేవస్థానం మరియు శ్రీ సాయి నాట్యాంజలి ఫైన్ ఆర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ నంద్యాల వారి ఆధ్వర్యంలో ఎనిమిదవ జాతీయ మహాశివరాత్రి నృత్య ఉత్సవాలను దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం శ్రీనివాసరావు , పబ్లిక్ రిలేషన్స్ అధికారి టి శ్రీనివాసులు, ఫెస్టివల్ డైరెక్టర్ డాక్టర్ పల్లంశెట్టి సురేష్ మరియు గురువులు లలిత్ కుమార్ గుప్తా , సంతోష్ కుమార్ తమాంగ్ , అంగుష్మెంట్ గుప్తా , అచంట చంద్రశేఖర్ , మహేష్ మంద , రేణుక ప్రభాకర్, పద్మావతి ప్రారంభించారు . ఈ సందర్భంగా పబ్లిక్ రిలేషన్స్ అధికారి టి శ్రీనివాసులు మాట్లాడుతూ అంతరించిపోతున్న నృత్య కళలు అయినా కూచిపూడి , భరతనాట్యం ,ఆంధ్ర నాట్యం , పేరిణి నాట్యం, ఒడిసి నాట్యం మొదలగు కలలను ఆదరించి వాటిని అభివృద్ధి చేసుకోవలసిన బాధ్యత మన అందరిదీ అన్నారు , కలలు సనాతన ధర్మాన్ని కాపాడటంలో కలలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నదని కాబట్టి మనకున్న 64 కలలను మనం కాపాడుకోవాల్సినదిగా కోరారు , ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , కర్ణాటక , తమిళనాడు , పశ్చిమబెంగాల్ మొదలగు రాష్ట్రాల నుండి కూచిపూడి , భరతనాట్యం , పేరుని నాట్యం , ఆంధ్ర నాట్యం , ఒడిసి నాట్యం, జానపదం , గిరిజన నాట్యం కళాకారులు 200 మంది కళాకారులు పాల్గొన్నారు .

ఈ కార్యక్రమంలో కే మౌనిక , పద్మావతి , రవికుమార్ రాకేష్ , సత్యనారాయణ రెడ్డి , మణికంఠ , మానస, ప్రసన్న ,ప్రముఖ ఛాయాగ్రహకులు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.