ర్యాగింగ్ కు పాల్పడినట్లయితే చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం..
ఇన్‌స్పెక్టర్ జి.డి. బాబు…..
విశాఖపట్నం(అక్షర ప్రళయం)

విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, గురువారం ఆంధ్రా మెడికల్ కాలేజ్ (ఏ.ఎం.సి) ప్రాంగణంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జి.డి. బాబు ఆధ్వర్యంలో “యాంటీ ర్యాగింగ్ మరియు మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం” నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ఏ.ఎం.సి ప్రిన్సిపాల్ , హెచ్.ఓ.డి గీతాంజలి, రవీందర్ కిషోర్, భవాని , ప్రొఫెసర్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. వారు విద్యార్థులకు ర్యాగింగ్ మరియు డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాల గురించి వివరించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రమాణ స్వీకారం చేసి –”గంజాయి వద్దు – మత్తు పదార్థాలు వద్దు – ర్యాగింగ్ చేయవద్దు – చదివే ముద్దంటున్న ఏఎంసీ విద్యార్థులు” అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ జి.డి. బాబు మాట్లాడుతూ –”ర్యాగింగ్ కు పాల్పడినట్లయితే చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. మత్తు పదార్థాలు వ్యక్తిగత జీవితాన్నే కాకుండా కుటుంబం, సమాజాన్ని నాశనం చేస్తాయి. ప్రతి ఒక్కరు చట్టాన్ని గౌరవిస్తూ మంచి పౌరులుగా ఎదగాలి” అని సూచించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్, సిబ్బంది మరియు విద్యార్థులు కలిసి ఇన్‌స్పెక్టర్ జి.డి. బాబు ని ఘనంగా సత్కరించారు.