విశాఖపట్నం(అక్షర ప్రళయం)

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తన పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి ప్రచారాన్ని పండగ వాతావరణంలో ప్రారంభించింది. ఏడాది కాలంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు నేరుగా వివరించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం.
ఈ సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం 39 వ వార్డులో సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం బూత్ నెంబర్ 108,109,110 లలో బూతు కన్వీనర్లు సత్యనారాయణ, రాజారావు, రుకియా, బషీర్ లతో పాటుగా క్లస్టర్ ఇంచార్జ్ మైలిపిలి శ్రీను గడపగడపకు కరపత్రాలు పంచి ప్రభుత్వ కార్యక్రమాలను కోసం విస్తృతంగా ప్రచారం చేశారు.