వివేకానంద సంస్థలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

వన్ టౌన్,(అక్షర ప్రళయం)

శ్రీ స్వామి వివేకానంద సంస్థ వారు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ రిపబ్లిక్ డే కార్యక్రమానికి వివేకనంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్.సి.ఎం.ఏ. జహీర్ అహ్మద్,ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల చైర్మన్ మక్సుద్ అహ్మద్, జెండా వందనం నిర్వహించారు. అనంతరం వివేకానంద సంస్థ ట్యూషన్ విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, 1950 సంవత్సరం జనవరి 26వ తేదీ నుండి మన భారతదేశ రాజ్యాంగం అమలులోనికి వచ్చిందని, దీనినే గణతంత్ర దినోత్సవం గా భారతదేశం మొత్తం వేడుకలను నిర్వహిస్తారని తెలియజేశారు. డాక్టర్ మక్సూద్, సంస్థ అధ్యక్షులు అప్పారావు ,సంస్థ సభ్యులు, ట్యూషన్ విద్యార్థులు భారతమాతకు జేజేలు అంటూ నినాదాలతో సైకిళ్లతో ర్యాలీని నిర్వహించారు. పిల్లలకు పుస్తకాలను, చాక్లెట్లు ,. బిస్కెట్లను పంచారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు మరియు మహిళా సభ్యులు, ట్యూషన్ విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *