మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలి.
సీతం రాజు సుధాకర్..
మహిళలు చైతన్యవంతం అయినప్పుడే సమాజంలో అభివృద్ధి.
వి.జి.హెచ్ సుపెరిండెంట్ ఉష ప్రసాద్..
వన్ టౌన్,(అక్షర ప్రళయం)

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 36వ వార్డ్ దక్షిణ నియోజకవర్గo తెలుగుదేశం పార్టీ మహిళ అధ్యక్షురాలు, శ్రీ కనకమహా లక్ష్మీ మహిళా సంఘాల (ఎన్.జ.ఓ) నాయకురాలు కేదారి లక్ష్మి ఆధ్వర్యంలో గోషా హాస్పిటల్ (వి.జి.హెచ్) కమ్యూనిటీ హాల్లో మహిళ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బాలికలతో కూచిపూడి నృత్య ప్రదర్శనను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అదితిగా దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి ,ఎన్టీఆర్ వైద్య సేవలు చైర్మన్ సితంరాజు సుధాకర్ విచ్చేసి మహిళలకు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సితంరాజు సుధాకర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలన్నారు. తదనంతరం వివిధ రంగాల్లో ఉన్న మహిళలను ఘనంగా సన్మానించారు.తదనంతరం కేదారి లక్ష్మి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి అని అన్నారు. కార్యక్రమంలో ఘోష హాస్పిటల్ (వి.జి.హెచ్) సుపెరిండెంట్ ఉష ప్రసాద్ మాట్లాడుతూ మహిళలు చైతన్యవంతం అయినప్పుడే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

తెలుగు దేశం పార్టీ నాయకురాలు అనంతలక్ష్మీ , ఈతలపాక సుజాత, మహిళ పోలీస్ కానిస్టేబుల్ రజియా, ప్రముఖ మహిళా లాయర్ లకు సీతంరాజు సుధాకర్ సన్మానించడం జరిగింది.e కార్యక్రమంలో కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు, డాక్టర్లు,పోలీసులు, లాయర్లు,ఆశ వర్కర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు