విశాఖ దక్షిణం,(అక్షర ప్రళయం)

డాక్టర్.బొల్లవరపు జాన్ వెస్లీ జన్మదిన వేడుకలు ఆదివారం దక్షిణ నియోజకవర్గం లో వున్న ఏ.వి.ఎన్ కాలేజీ సమీపంలో గల ప్రేమ సమాజంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా మాజీ ఏపీ టూరిజం డైరెక్టర్ రేవతి డేవిడ్ రాజు బొల్లవరపు జాన్ వెస్లీ కి సాలువాత్ సత్కరించి కేక్ కట్ చేయించి జన్మదిన శభాకాంక్షలు తెలియజేసారు.తదనంతరం బొల్లవరపు జాన్ వెస్లీ చేతులు మీదుగా ప్రేమ సమాజంలో వున్న హోం సభ్యుల కు ఫ్రూట్స్ మరియు సుగర్ ఫ్రీ బిస్కెట్స్, స్త్రీల కు చీరలు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో 37 వార్డు కార్పొరేటర్ చెన్న జానకి రామ్, రవీంద్ర భరత్, కంటూ ముచ్చు సాగర్ ,వెంకట రావు ,ఆకుల యేసు,గోపి, రోజా, రమణి,కమల్ , టి.తులసీ, సి.హెచ్. సరోజిని, పరదేశమ్మ ,డి.వి డి, బూర రవి, నూక రాజు, శివ, అనేక మంది కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.