పాడేరు డివిజన్‌ను జోన్-1లో చేర్చాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి, సి.పి.ఐ.ఎం పార్టీ జిల్లా కార్యదర్శి పి. అప్పల నరస డిమాండ్
ఏ.ఎస్.ఆర్ జిల్లా,(స్వతంత్ర ప్రభ)
అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు తరువాత జోన్-1లో ఉన్న పాడేరు డివిజన్‌ను జోన్-2లోకి మార్చడం అత్యంత దారుణమైన నిర్ణయం. జిల్లా విభజనకు ముందు నుండి జోన్-1లో ఉన్న పాడేరు డివిజన్‌ను తరువాత జోన్-2లో చేర్చి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం ఆదివాసీ ప్రజల హక్కులకు ప్రతికూలం. ఇప్పటికే చాలా సార్లు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా, కేంద్రం ఆదివాసీ ప్రాంతాల 5వ షెడ్యూల్ భూములను విభజించడం ద్వారా ప్రజా హక్కులు, చట్టాలను రక్షించే కీలకమైన సాంవిధానిక నిబంధనలను ఉల్లంఘించింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి తగిన చర్య కాదు. ఐదవ షెడ్యూల్ నుంచి ఆరో షెడ్యూల్ కి ఆదివాసి ప్రాంతాలను మార్చాలని ఇప్పటికే ఆదివాసి ఉద్యమ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి వాటిని పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా జోనల్ వ్యవస్థ పేరుతో ఆదివాసి ప్రాంతాల్లోఇతర ప్రాంతాల వారికి స్థానికత పేరుతో 95శాతం ఉద్యోగం కల్పించడం రాజ్యాంగ విరుద్ధం. ఐదవ షెడ్యూల్ స్ఫూర్తి దెబ్బతీస్తుంది ఇప్పటికే 1/70 చట్టాలు నిర్వీర్యం అవుతున్నాయి. టూరిజం పేరుతో బడా కార్పొరేట్ కంపెనీలంతా ఏజెన్సీ పై దృష్టి పెట్టి అడ్డగోలుగా ప్రభుత్వ భూములను ప్రజలు భూములను కొల్లగొడుతున్నారు. మరో పక్క ఉపాధి ఉద్యోగ అవకాశాలు స్థానిక ఆదివాసులు కోల్పోతున్నారు. ఆదివాసి ప్రాంతాల హక్కులు చట్టాలు పరిరక్షణ కోసం పాడేరు అల్లూరు జిల్లాను జోన్వన్లోనే కొనసాగించవలసిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం 100% ఉద్యోగ ఉపాధ్యాయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన హామీ కూడా నేటి నెరవేర్చకపోవడం ఆదివాసి ప్రజల్లో మరి అంత నిరాశ, నిస్ప్రొవకు దారితీస్తుంది. ప్రభుత్వాలు ఉన్న చట్టలు రక్షించలేక అమలు చేయలేక వాటిని బలహీనంపరిచే కుట్రలకు పూనుకోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగదని విమర్శించారు.సూచనలు.1. అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్-1లోనే ఉంచి, జోన్-2 నుండి తొలగించాలి. 2. పాడేరు డివిజన్‌ను జోన్-2లో చేర్చడం రద్దు చేసి, జోన్-1లోనే కొనసాగించాలి. 3. వచ్చే క్యాబినెట్ సమావేశంలోనే పాడేరు జిల్లాను జోన్-1లో ఉంచేలా తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి వెంటనే సమర్పించాలి. 4. ఆదివాసీ ప్రాంతాల్లో 5వ షెడ్యూల్ హక్కులను కాపాడటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలి. ఈ అంశం ఆదివాసీ ప్రజల భూహక్కులు, సామాజిక-ఆర్థిక అభివృద్ధి మరియు సాంవిధానిక రక్షణకు సంబంధించినది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి సానుకూల చర్యలు తీసుకోవాలని సి.పి.ఐ.ఎం పార్టీ డిమాండ్ చేస్తోంది.