ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
పశ్చిమ గోదావరి జిల్లా బ్యూరో:(స్వతంత్ర ప్రభ)
స్వచ్ఛమైన రాజకీయా లు,నాణ్యమైన పరిపాలన రావాలంటే విద్యావంతులు, మేధావులైన యువత రాజకీయాల్లోకి రావాలని శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కిమ్స్ ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటుకి నోటు ఇచ్చే దుస్థితి నుంచి రాజకీయాలు మారాలని ఈ మార్పు విద్యావంతులైన యువతతోనే సాధ్యమని అన్నారు. ఇప్పటికే రాజకీ యాలలో అనేకమంది సీనియర్లు ఉన్నారని, సీనియారిటీ కంటే మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త ఆలోచనలు నేటి తరా నికి అవసరమని చెప్పారు. సామాన్యుడికి రాజకీయాలలో ప్రవేశించే అవకాశం ఉండాలని న్నారు. ధనం లేనిదే రాజకీయాల్లో మనుగడ సాగించే అవకాశం లేదని ఈ పరిస్థితి మారాలంటే విద్యావంతులయిన జర్నలిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు, తదితర మేధావి వర్గాల నుంచి రాజకీయాల్లోకి రావాలని అప్పుడే మార్పు సాధ్యపడుతుందన్నారు.అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. ప్రజలు ఇచ్చిన మద్దతుతో తాను గెలిచానని, అది తనపై పెద్ద బాధ్యతగా భావిస్తున్నాన న్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం తన కర్తవ్యమ ని, ఎవరూ చెప్పకపోయినా బాధ్యతగా తీసుకుని పనిచేస్తానని స్పష్టం చేశారు. నన్నయ విశ్వవిద్యాలయం ప్రాంగణానికి మౌలిక వసతు లను అభివృద్ధి చేస్తామన్నారు. గత రెండు సంవత్సరాల కృషి ఫలితంగా చాలా అభివృద్ధి పనులు చేశామన్నారు. వచ్చే ఐదేళ్లలో ఇంకా వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. విద్యార్థులు రాజకీయాలపై అవగాహన కలిగి ఉండాలని, రాజకీయాలు డబ్బుతో కాకుండా విశ్వాసంతో నడవాలన్నారు. ఎల్ ఈ డిలైట్లు, పార్కులు, జిమ్, క్రికెట్, ఇండోర్ స్టేడియాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి అవసర మైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.హైస్కూల్‌ను మోడల్ స్కూల్‌గా అభివృద్ధి చేశామని, ఈతకొలను కూడా సిద్ధంగా ఉందని వెల్లడించారు.ప్రజల సహకారంతో అభివృద్ధి కొనసాగుతుందని అన్నారు. వైద్య శిబిరంలో గుండె, ఊపిరితిత్తులు, ఎముకలు, నేత్ర,దంత వైద్యం విభాగాలకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అవసరమైన వారికి మెరుగైన వైద్యం కోసం సిఫార్సు చేశారు. నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చిత్తశుద్ధి తో కృషి చేస్తున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను విశ్వవిద్యాలయ సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో నన్నయ విశ్వవిద్యాలయం హెడ్ డాక్టర్ హీరా, కిమ్స్ ఆసుపత్రి వైద్య సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.