నిజాంపేట్, హైదరాబాద్, (స్వతంత్ర ప్రభ)
సెలబ్రిటీ డిజైనర్ రుడావత్ వర్షా నాయక్ ఆధ్వర్యంలో ఆర్‌విఎన్ ఎగ్జిబిషన్ థర్డ్ సీజన్ నిజాంపేట్‌లోని కోలన్ రాఘవరెడ్డి గార్డెన్లో ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ గౌరవాధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు శ్రీ బంజారా భీష్మ అమర్ సింగ్ తిలావత్ హాజరై, తమ చేతుల మీదుగా ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా తిలావత్ మాట్లాడుతూ, మహిళలను వ్యాపార రంగంలో ప్రోత్సహించడానికి ఇలాంటి ఎగ్జిబిషన్లు ఎంతో దోహదపడతాయని తెలిపారు. బంజారా సమాజానికి చెందిన ఒక మహిళ సెలబ్రిటీ డిజైనర్‌గా ఎదగడం గర్వకారణమని, అదే సమయంలో ఇతర మహిళలకు అవకాశాలు కల్పించడానికి వర్షా నాయక్ చేపడుతున్న ఈ కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా వర్షా నాయక్‌ను ఆదర్శంగా తీసుకుని బంజారా సమాజంలోని యువత ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర మీడియా సెక్రటరీ తేజావత్ భీముడు నాయక్, జాతీయ యువ నాయకుడు వెంకట్ తిలావత్, ప్రముఖ టీవీ సీరియల్ నటీనటులు మరియు యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్లు పాల్గొన్నారు.ఎగ్జిబిషన్లో స్టాల్స్ ఏర్పాటు చేసిన వ్యాపారులు మాట్లాడుతూ, కార్యక్రమం చాలా సమర్థవంతంగా నిర్వహించారని, భవిష్యత్తులో కూడా ఆర్‌విఎన్ ఎగ్జిబిషన్‌ను మరింత విస్తృత స్థాయిలో నిర్వహించాలని ఆకాంక్షించారు.