ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు

విశాఖపట్నం, (స్వతంత్ర ప్రభ)
నీతి, నిజాయితీ మరియు నిరంతర కృషితోనే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. విశాఖ నగరానికి చెందిన బైసన్ బౌన్సర్స్ అసోసియేషన్ ప్రతినిధులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం ఆయన చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, బౌన్సర్లు తమ వృత్తిలో అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉండాలని, క్రమశిక్షణతో మెలుగుతూ సంస్థకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జాతీయ అవార్డు గ్రహీత రూపాకుల రవికుమార్, అసోసియేషన్ ప్రతినిధులు మహమ్మద్ సుజావుద్దీన్ అన్సారి, టాంక్ అవతార్ సింగ్, అభి, గఫూర్, మున్నా, పవన్ కుమార్, సాగర్, మరగడ గౌరీ రెడ్డి తదితరులు పాల్గొని గవర్నర్ చేతుల మీదుగా గుర్తింపు కార్డులను అందుకున్నారు.