వైసిపి కార్యకర్తకు వాసుపల్లి 5వేలుఆర్థిక సాయం

విశాఖ దక్షిణం (స్వతంత్ర ప్రభ)

దక్షిణ నియోజకవర్గ ఆపద్బాంధవుడు, పేదల పెన్నిధి వాసుపల్లి గణేష్ కుమార్ నిర్విరామంగా చేస్తున్న ప్రజాసేవ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రజలకు మాత్రమే కాకుండా వైసిపి కార్యకర్తలకు కూడా తానున్నానంటూ భరోసా అందిస్తున్నారు. దీనిలో భాగంగా దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు వైసిపి కార్యకర్తకు మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అండగా నిలిచారు*. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దండు బజార్ సచివాలయం ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి *చెన్న వీరసాగర్ తేజ  కు మెడికల్ ఖర్చులకు వాసుపల్లి గణేష్ కుమార్ సొంత నిధులతో 5వేలుఆర్థిక సహాయం అందజేశారు 29వ వార్డు వెంకటపతి రాజు నగర్ లో నివసిస్తున్న కార్యకర్తకు ప్రమాదవశాత్తు చేయు విరిగి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని 29వ వార్డు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు పీతల వాసు ద్వారా విషయం తెలుసుకొని వాసుపల్లి గణేష్ కుమార్ నేరుగా వెళ్లి పరామర్శించారు. కార్యకర్తలకు ప్రజలకు అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్ దాతృత్వం పై పలువురు ప్రశంసలు అందిస్తున్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్, సౌత్ బీసీ సెల్ ప్రెసిడెంట్ బొందదా  వెంకట రావు,వార్డ్ సోషల్ మీడియా ప్రెసిడెంట్ పడాల సూర్య,29వ వార్డు వైసిపి నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *