నీటిని వృథా చేయకండి

సౌత్ జోన్ జోనల్ కమిషనర్  ఎం.మల్లయ్య నాయుడు

విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ)

సౌత్ జోన్ జోనల్ కమిషనర్  ఎం.మల్లయ్య నాయుడు వార్డ్ నెం. 31, 36, 35 పరిధిలోని దాబా గార్డెన్స్ మెయిన్ రోడ్, రంగ్రేజీ వీధి, ఏవీఎన్ కాలేజ్ టౌన్, కొత్త రోడ్, 75 ఫీట్ రోడ్, డాల్ఫిన్ జంక్షన్ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా ఆయ‌న ముఖ్యంగా రోడ్లపై పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని, అలాగే కాలువల నుండి తీసే వ్యర్థాలను ఆలస్యం చేయకుండా వెంటనే తొలగించాలని సంబంధిత సానిటరీ ఇన్స్పెక్టర్లకు ఆదేశించారు.వార్డ్ నెం. 36లోని రంగ్రేజీ వీధి ప్రాంతంలో ప్రజలు ఇంటింటికి వచ్చే చెత్త సేకరణ వాహనానికి చెత్తను ఇవ్వకుండా కాలువల్లో వేస్తున్నట్లు గమనించి, ఈ విషయంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు తప్పనిసరిగా ఇంటికి వచ్చే వాహనానికి లేదా పారిశుధ్య కార్మికులకు చెత్తను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అదేవిధంగా, తాగునీటి వృథా జరుగుతున్న విషయాన్ని గమనించి, ప్రజలు నీటిని సంరక్షణతో వినియోగించాలని, అవసరం లేని సమయంలో ట్యాపులకు బిరడాలు బిగించి నీటి వృథాను నివారించాలని సూచించారు.ఈ పర్యటనలో వార్డు సానిటరీ ఇన్స్పెక్టర్ అప్పలరాజు శివప్రసాద్ గారు, సానిటేషన్ సెక్రటరీలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *