జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు

విశాఖ దక్షిణం (స్వతంత్ర ప్రభ)
జి.వి.ఏం.సి సౌత్ జోన్ జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు బుధవారం 33వ వార్డు పరిధిలోని మిరపకాయలు వీధిలో ప్రజలకు అందిస్తున్న త్రాగునీటి నాణ్యతను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వాటర్ సప్లై నుండి నమూనాలు (వాటర్ శాంపిల్స్) సేకరించి పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా నీటిలో ఉన్న క్లోరినేషన్ శాతాన్ని పరిశీలించి, దాని ప్రాముఖ్యతను స్థానిక ప్రజలకు వివరించారు. త్రాగునీటి భద్రతకు క్లోరినేషన్ శాతం సరైన స్థాయిలో ఉండటం అత్యంత అవసరమని తెలిపారు. అలాగే ప్రజలు నీటిని వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలగే ప్రజలకు నీటి సరఫరా కు సంబంధించి ఏమైనా పిర్యాదులు ఉంటే పురమిత్ర అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని, ఫిర్యాదులను నమోదు చెయ్యమని తెలియజేశారు.ఈ సందర్భంగా సౌత్ జోన్ పరిధిలోని అన్ని వార్డుల్లో నీటి సరఫరా సమయంలో తప్పనిసరిగా వాటర్ శాంపిల్స్ సేకరించి నిరంతరం పరీక్షలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా వాటర్ సప్లై లైన్లలో లీకేజీలు ఉన్నట్లయితే వెంటనే మరమ్మత్తులు చేసి, నీరు కాలుష్యం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ పర్యటనలో వార్డు నెంబర్ 33 అసిస్టెంట్ ఇంజనీర్ (వాటర్ సప్లై) శివ కుమార్ మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.