వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్

విశాఖపట్నం (స్వతంత్ర ప్రభ)
వి ఎం ఆర్ డి ఎ కి చెందిన ప్రధాన కళాక్షేత్రాలు, వాణిజ్య సముదాయాలు, కళా వేదికల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్ గారు ఆదేశించారు. గురువారం ఉదయం వి ఎం ఆర్ డి ఎ చిల్డ్రన్ ధియేటర్, గురజాడ కళాక్షేత్రం పరిసరాలను వి ఎం ఆర్ డి ఎ కార్యదర్శి మురళీ కృష్ణ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా కళా వేదికల్లో ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్న సమయంలో పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరాన్ని బట్టి పరిశుభ్రత కోసం సిబ్బందిని పెంచాలని కోరారు. కార్యక్రమంలో వి ఎం ఆర్ డి ఎ కు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.