విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా మట్ల ఆదివారం వేడుకలు

విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ)

విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని 35వ వార్డులో మట్ల ఆదివారం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కృపామయ ప్రార్థన సహవాసం దైవజనులు మేరీ జోసెఫ్ ఆధ్వర్యంలో సువార్త రాజు మరియు సంఘస్తులందరూ కలిసి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఆదివారం ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు పండ వీధి, ప్రసాద్ గార్డెన్, రామకృష్ణ రైతు బజార్, గాజుల వీధి, కలుపాకలు, పూర్ణ మార్కెట్, వేలంపేట, మేదర వీధి, పేరుకువీధి, ఆయిల్ సందు మరియు ఇంకా అనేక వీధుల్లో భక్తిశ్రద్ధలతో ప్రార్థనా యాత్ర సాగింది. మట్ల ఆదివారం సందర్భంగా దైవజనులు మేరీ జోసెఫ్, సువార్త రాజు నేతృత్వంలో సంఘ సభ్యులందరూ కలిసి ఏసుక్రీస్తు విజయ ప్రవేశాన్ని స్మరిస్తూ ఈ ప్రార్థన సహవాసాన్ని ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక క్రైస్తవ సోదరులు మరియు సంఘస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *