విశాఖ తూర్పు,(స్వతంత్ర ప్రభ)
వి.ఎం.అర్.డి.ఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్ లో చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ ప్రజా పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు అందుకున్నారు. వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్లానింగ్, ఎస్టేట్ విభాగాలకు వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వినతుల పరిష్కారంలో అన్ని అంశాలను పరిశీలించి,బాధితులకు సానుకూలంగా తగిన న్యాయం చేయాలని సూచించారు. గడువులోగా బాధితులకు సరైన సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రజా దర్బార్ కి 14 వినతులు రాగా, వాటిలో ప్లానింగ్ విభాగానికి 4, ఎస్టేట్ విభాగానికి 5, రెవెన్యూ విభాగానికి 1, పరిపాలన విభాగానికి 4 చొప్పున వినతులు వచ్చాయి. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ కె.రమేష్, కార్యదర్శి మురళీ కృష్ణ, ఎస్టేట్ అధికారి దయానిధి, విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.