వైఎస్ఆర్సిపి దక్షిణ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్
విశాఖ దక్షిణం ( స్వతంత్ర ప్రభ)
తిరుమల పవిత్రతకు కళంకం తెచ్చిపెట్టిన టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడుని ప్రభుత్వం తక్షణమే తొలగించాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు.వైసిపి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ చైర్మన్ పదవి నుండి బీర్ నాయుడు ను తొలగించాలని డిమాండ్ చేస్తూ దక్షణ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో నిర్వహించిన నిరసన కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. 38వ వార్డు కంచర వీధి లో వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించి, పూజలు చేసిన అనంతరం గోసాల ఆస్పత్రి రాములవారి ఆలయం వద్ద జరిగిన వినూత్న కార్యక్రమంలో వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ చేతకాని కూటమి ప్రభుత్వం వల్ల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తన పదవికి కళంకం తెచ్చే పనులు చేపడుతున్నారని ఆరోపించారు.రెడ్ హ్యాండెడ్ గా ఒక మహిళతో ఆయన అసభ్యకర రీతిలో ఉన్న వీడియోలు బయటపడినప్పటికి కూడా ప్రభుత్వం ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు.బి ఆర్ నాయుడుకు మంచి పదవి ఇవ్వాలంటే టీటీడీ చైర్మన్ పదవి నుండి తొలగించి మరొక పదవిని ఆయనకు ఇచ్చి, అతనిని నెత్తి మీద కూర్చో పెట్టుకోవచ్చని ఎద్దేవా చేశారు. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ నాయుడు పట్ల కనీస విచారణ జరగకుండా, ఆయనకు పూర్తిగా చంద్రబాబు నాయుడు వత్తాసు పలకడం విచారకరమని పేర్కొన్నారు.ఇలా ప్రభుత్వంలో ఎవరు తప్పులు చేసినా వారిని వెనుకేసుకొరావడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అలవాటయింది అని అన్నారు. అయితే ప్రజలు అన్ని గమనిస్తున్నారని, కచ్చితంగా వచ్చే ఎన్నికలలో తమ ఓటుతో గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.తమ పార్టీ అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతుందన్నారు.ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పారు.అలాగే టీటీడీ చైర్మన్ పదవి నుంచి బి ఆర్ నాయుడు ను తొలగించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, 38వ వార్డు వార్డు అధ్యక్షులు: గురజాపు రవి గారు, రాష్ట్ర బి.సి సెల్ అధ్యక్షులు సనపాల రవీంద్ర భారత్,జిల్లా వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ రాజు ,జిల్లా జనరల్ సెక్రటరీ గనగల రామరాజు,వార్డు యువజన అధ్యక్షులు చేపల నూకరాజు (బుడ్డి) ,అర్జున్ ప్రసాద్, అన్మోల్,నాని, సందీప్, రాజేష్, నాగేష్, కోసూరు కిరణ్,,కోసూరు సురేష్,చేపల రాజు, సరిపిల్లి రాజు,వాసుపల్లి రాజు,చిన్ని కృష్ణ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.