విశాఖ తూర్పు (స్వతంత్ర ప్రభ)
9వ వార్డు పరిధిలో డ్రైనేజీలు మరియు రోడ్లు, కాలువలు పూర్తిగా దెబ్బతినడంపై అధికారులు మరియు స్థానిక నాయకులు స్పందించారు. బుధవారం (ఏ.ఈ) చంద్రమౌళి మరియు సచివాలయం సిబ్బంది వార్డులో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.వార్డులో దెబ్బతిన్న రోడ్లు మరియు మురుగునీరు నిలిచిపోయిన కాలువలను గ్రామ పెద్ద ఉమ్మిడి అప్పారావు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మిడి సుజాత, టీడీపీ వార్డు అధ్యక్షులు వేదెళ్ల సుబ్బరాజు, వార్డు ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డి, మరియు సీనియర్ నాయకులు గరికిన నూకరాజు, శ్రీను,అప్పలరాజు తదితరులు అధికారులకు స్వయంగా చూపించి వివరించారు.ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, వెంటనే నిధులు మంజూరు చేసి మరమ్మత్తు పనులు చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై ఏఈ స్పందిస్తూ, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.