ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం (స్వతంత్ర ప్రభ) పశ్చిమగోదావరి జిల్లా బ్యూరో
రాజకీయ మర్యాదలు పాటిం చడం చేతగాని అరాచకవాది, కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని అగౌరవ పరిచే జగన్ ఒక చెత్త పుత్రుడని, అమరావతికి అడ్డుపడే అభివృద్ధి నిరోధకు డని శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. అభిమానులు ఆరాధ్య దైవంగా భావించే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను దత్తపుత్రుడు అంటూ పదేపదే సంబోధించ డంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.స్థానిక శాసనసభ్యుని విడిది కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ తీరు మారకపోతే ఇకనుంచి అతనిని చెత్త పుత్రుడు అని పిలుస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలందరికీ పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడే అన్నారు. జగన్ పుట్టినరోజుకు పవన్ శుభాకాంక్షలు తెలియజేశారని జగన్ కు అలాంటి సంస్కారం లేదని అన్నారు. రాజకీయాల లో గెలుపు, ఓటమి సహజమ ని, పరస్పరం గౌరవించుకోవడం ముఖ్యమన్నారు. ఇకనుంచైనా జగన్ అసూయతో విషం కక్కటం మానాలని, సంస్కారవంతమైన భాష మాట్లాడాలని సూచించారు. విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తామంటూ ప్రగల్బాలు పలికిన జగన్ ను రాష్ట్ర ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశార న్నారు. ఇప్పుడు మళ్ళీ మేమే వచ్చేస్తాము అంటూ ఉత్తర కుమారుడి ప్రగల్బాలు పలుకు తున్నారని విమర్శించారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు 40వేల కోట్ల అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లిన వ్యక్తి, తాను అధికారం చేపట్టి రాష్ట్ర ఖజానా ను దోపిడీ చేశారని విమర్శించారు. రాష్ట్ర నిధులే కాకుండా కేంద్రం నుంచి వచ్చే 15 వ ఫైనాన్స్ నిధులను కూడా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు మనశ్శాంతి లేకుండా చేసిన చెత్త పుత్రుడు జగన్ అని వైయస్ పేరు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను దగా చేశారన్నారు . సంక్షేమం పేరుతో వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారన్నారని. విమర్శించారు. కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లిని కూడా మోసం చేసి బయటకు వెళ్లగొట్టిన ఘనుడు జగన్ అన్నారు. చెత్త పుత్రుడు జగన్ తన సైకో మనస్తత్వాన్ని అమరావతి విషయంలో మరోసారి రుజువు చేశారన్నారు. ‘మావిగన్’ అంటూ ఎన్నడూ వినని పిచ్చి మాటలు మాట్లాడుతుంటే వైసీపీ నాయకులు కూడా అర్థం కాక తలలు పట్టుకుంటున్నార ని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నఅయిదేళ్లలో మావిగన్ గురించి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రాజధాని అనేది రాష్ట్రానికి ఆయువు పట్టు లాంటిదని విషయాన్ని జగన్ గ్రహించాలన్నారు. అమరావతి ని పక్కనపెట్టి మూడు రాజధానులు అంటూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు. అధికారంలో ఉండగా ప్రజలకు మేలు చేయలేక పోయారని చెప్పారు రూ.2,50,000 కోట్లు సంక్షేమం చేసి, రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారని మిగతా 7,50,000 కోట్లు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. అవినీతి పాలనతో తిరస్కారానికి గురైన వైసిపి తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందడానికి ప్రయత్నించాల న్నారు. పాదయాత్ర చేసినా, రోడ్లపై దొర్లుతూ దండాలు పెట్టినా వారి ఇష్టమని,ఏదైనా సంస్కారవంతంగా రాజకీయా లు చేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వం హామీలు పూర్తిస్థాయిలో నెరవేర్చినప్పటి కీ వైసీపీ వాళ్లకు కనిపించడం లేదన్నారు. రైతులకు సకాలంలో పంట సొమ్ము చేతికందే విధంగా చేశామన్నా రు. వచ్చేయడాది పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు.అమరావతిలో అప్రతిహతంగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. వైసిపి హయాంలో జలజీవన్ మిషన్ పథకాన్ని బ్రష్టు పట్టించారన్నారు.కూటమి వచ్చాక నిధులు తీసుకువచ్చి ప్రతి గ్రామానికి రక్షిత మంచినీరు అందే విధంగా చర్యలు చేపట్టామ న్నారు. గత ఐదేళ్లలో ధ్వంసమైన రోడ్లు డ్రైన్లను పూర్తిస్థాయిలో తిరిగి నిర్మించామన్నారు. రెండవ వేసవి నీటినిల్వ ట్యాంకును త్వరలో పూర్తి చేస్తామన్నారు. గత రెండు సంవత్సరాలనుండి భారీ ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ముందుకెళ్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా వాస్తవ దృక్పథంతో మాట్లాడాలని అసత్య ప్రచారం చేస్తే ప్రజలు వైసిపిని నమ్మే పరిస్థితి లేదన్నారు. సమావేశంలో కూటమి నాయకులు వాడపల్లి సుబ్బరాజు , మద్దిపాటి ధర్మేంద్ర,నీలపాల దినేష్ మాట్లాడారు.