అభినందనలు తెలిపిన ఎల్బీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ బీహెచ్ రావ్
వరంగల్ (స్వతంత్ర ప్రభ)
వరంగల్ ఎల్బి కళాశాల ఎన్సిసి 10వ తెలంగాణ బెటాలియన్ ఆర్మీ వింగ్ నుండి జి .అక్షిత కు వ్యాసరచన పోటీల్లో వరంగల్ గ్రూప్ అంతర్ కళాశాల పోటీలో మొదటి బహుమతి సాధించిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అరుణ డిహెచ్ రావు తెలిపారు. హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఎన్సిసి “అస్త్ర 2026” అంతర్ కళాశాలల పోటీలు నిర్వహించినట్లు అందులో ఎల్బీ కళాశాల రెండవ సంవత్సరం చదువుతున్న జి. అక్షిత వ్యాసరచన పోటీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాపిక్ లో మొదటి స్థానం సాధించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ప్రతిభ ఆధారంగా ఈ అరుదైన అవకాశం వచ్చిన సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రాంగణంలో జి అక్షితను అభినందించారు. ప్రతిభలో అక్షిత మొదటి నుంచి ముందంజలో ఉందని పోటీ తత్వాన్ని అలవర్చుకొని విజయాలను సులభంగా చేదించాలని అప్పుడే జీవితంలో అనుకున్న లక్ష్యాలు సాధించొచ్చు అని ప్రిన్సిపాల్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కెప్టెన్ డాక్టర్ ఎం సదానందం, మహేకు, హరి లోకేష్, సమీర్, అజయ్, మనోజ్, అయాన్ పాషా అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు.