హిందూధర్మం వికసించాలి

ఎమ్మెల్యే బొలిశెట్టి…

తాడేపల్లిగూడెం, (స్వతంత్ర ప్రభ)

దేవాలయాల్లో పూజలు,జాతరలు,తదితర సంప్రదాయ ఉత్సవాల నిర్వహణ ద్వారా హిందూ ధర్మం వికసించాలని శాసనసభ్యులు,రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం గ్రామీణ మండలం, ఇటుకుల గుంట గ్రామంలో, శ్రీ శ్రీ శ్రీ తీర్ధాల మంగమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే శుక్రవారం దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ అమ్మవారి ఆలయాన్ని నిర్మించిన టిడిపి సీనియర్ నాయకుడు వాడపల్లి సుబ్బరాజును అభినందించారు. విలువలతో కూడిన సమాజం ఏర్పడాలంటే ఆధ్యాత్మిక చింతన అవసరమని, అందుకు ఆలయాల నిర్మాణం దోహదం చేస్తుందని అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు హిందువులంతా ఐకమత్యంతో కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *