నిస్వార్థసేవే జనసేన లక్ష్యం

ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

పశ్చిమగోదావరి జిల్లా బ్యూరో,(స్వతంత్ర ప్రభ)

ఎలాంటి పదవులు, ప్రయోజ నాలు ఆశించకుండా నిస్వార్ధం గా ప్రజాసేవ చేయడమే జనసైనికుల లక్ష్యమని శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ లో మంగళవారం బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవిలో ప్రజల దహార్తిని తీర్చేం దుకు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన  సేవా సమితి సభ్యులను ఆయన అభినందిం చారు. ఈ వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంద ని శాస్త్రవేత్తలు తెలియజేశారని అందుకు అనుగుణంగా ఏర్పా టు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ముఖ్య మైన ప్రాంతాల్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తా రని చెప్పారు. నియోజకవర్గం లో జనసేన, టిడిపి, బిజెపి పార్టీలు కలిసిమెలసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాయని, ఆదర్శవంతంగా ముందుకు వెళ్తామని తెలియజేశారు. బస్టాండ్ కూడలిలో చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మతో ప్రారంభో త్సవం చేస్తామన్నారు. ఈ రహదారికి శివాజీ మార్గ అని నామకరణం  చేస్తామని చెప్పారు.  తాను అభివృద్ధి విషయంలో ఎలాంటి కార్యక్ర మాలు చేపట్టిన పురపాలక కమిషనర్ ఏసుబాబు తక్షణమే స్పందించి, సహకరిస్తున్నా న్నారు. రాజకీయంగా తాము ఎంత కృషిచేసినా అధికారుల సహకారం ఉంటేనే ముందు కెళ్లగలమని, ఆ విషయంలో పురపాలక, రెవెన్యూ తదితర విభాగాల అధికారులు బాగా సహకరిస్తున్నారన్నారు. నేటి తరానికి దేశభక్తి గురించి అవగాహన కల్పించాలన్నారు. కేవలం మార్కులు, ఉద్యోగం, ధన సంపాదనల కే పరిమితం కాకుండా, దేశభక్తి, త్యాగ మూర్తుల గురించి తెలియ జేయాలన్నారు. దేశాన్ని ఏకతా టిపై నడిపించి చత్రపతిగా కీర్తి పొందిన శివాజీ తదితర మహనీయుల దేశభక్తిని, సేవానిరతిని నేటితరం అధ్యయనం చేయాలనీ ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమం లో మతి బాబ్జి, లింగం శ్రీనివా స్, మద్దాల నరసింహ, పో ప్పోపుల త్రినాధ్, రావూరి రమేష్, కేశవభట్ల విజయ్, పిడుగు రామ్మోహన్రావు బ్రదర్స్, వీరు, రౌతు సోమ రాజు, పాలూరి వెంకటేశ్వర రావు, రామిశెట్టి సురేష్, మొద్దాల చిన్ని, అనిల్, సిద్ధ వీరన్న, దాగరపు శ్రీను, నల్లగంచి రాంబాబు, రామ లక్ష్మణ్, వాడపల్లి సుబ్బరాజు మద్దిపాటి ధర్మేంద్ర, మద్దిపాటి రవితేజ, ఎరుబండి సతీష్, కూటమి నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *