వన్ టౌన్ సీఐ వరప్రసాద్ బృందానికి రివార్డులు
వన్ టౌన్ (స్వతంత్ర ప్రభ)
వివిధ పెండింగ్ కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో విశేష ప్రతిభ కనబరిచిన వన్ టౌన్ సీఐ పూడి వరప్రసాద్, ఎస్ఐ లక్ష్మణ్ మరియు వారి సిబ్బందికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించాయి. శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన రివార్డుల ప్రధానోత్సవంలో పోలీస్ కమిషనర్ (సీపీ) స్వయంగా వీరికి రివార్డులను అందజేసి అభినందించారు.దీర్ఘకాలంగా పరిష్కారం కాకుండా ఉన్న కేసులను పట్టుదలతో విచారించి, నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకోవడంలో ఈ బృందం కీలక పాత్ర పోషించింది. విధి నిర్వహణలో ప్రదర్శించిన ఈ చొరవ ఇతర సిబ్బందికి స్ఫూర్తిదాయకమని సీపీ కొనియాడారు. నేరాల నియంత్రణలోనూ, పెండింగ్ కేసుల పరిష్కారంలోనూ ఇదే రీతిన పనితీరు కనబరచాలని ఆయన సూచించారు. ఈ గుర్తింపు పట్ల సీఐ వరప్రసాద్ మరియు సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.