చలివేంద్రాలు ఏర్పాటు అభినందనీయం:ఎమ్మెల్యే బొలిశెట్టి.

తాడేపల్లిగూడెం,(,స్వాతంత్ర ప్రభ)

వేసవిలో బాటసారుల దాహం తీర్చే విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయటం అభినందనీయమని శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎస్.వి.ఆర్ కూడలిలో అంగిన ఫౌండేషన్ వ్యవస్థాపకులు హరికృష్ణ, వారి మిత్రబృందం ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేసవి లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని శాస్త్రవేత్తల సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు జనసైనికులు నిస్వార్ధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, అందులో భాగంగా చలివేంద్రాలు నిర్వహిస్తున్నారని అన్నారు. గూడెం మండల గ్రామాల నుంచి పట్టణానికి వచ్చే ప్రజలకు ఎస్వీఆర్ కూడలి ముఖద్వారం గా ఉందని, ఇక్కడ చలివేంద్ర ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీరు అందిస్తున్న అంగిన ఫౌండేషన్  సేవా బృందాన్ని  ఆయన అభినందించారు.డీజిల్ కోసం ఆందోళన వద్దు…డీజిల్ కోసం రైతులు, వాహనదారులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎమ్మెల్యే అన్నారు. ట్యాంకుల్లో నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.అందువల్ల డీజిల్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని అన్నారు. పెట్రోల్ బంకులను తాహసిల్దార్ స్వాధీనం చేసుకొని ఎటువంటి బ్లాక్ మార్కెట్ జరక్కుండా చర్యలు చేపట్టారని తెలిపారు.డీజిల్ కావలసినవారు తాహ సిల్దారు వద్ద పేర్లు నమోదు చేసుకొని,కూపన్లు తీసుకుంటే వారికి బంకుల వద్ద ఎటువంటి ఇబ్బంది లేకుండా డీజిల్ సరఫరా చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *