విశాఖ దక్షిణం (స్వతంత్ర ప్రభ)
దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్య నాయుడు గారు 29, 35, 31, 27 మరియు 41వ వార్డుల పరిధిలోని బీచ్ రోడ్డు, పూర్ణ మార్కెట్ మెయిన్ రోడ్డు, డాబా గార్డెన్స్, డైమండ్ పార్క్, దొండపర్తి ప్రాంతాలలో రాత్రి వేళల్లో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను ప్రత్యక్షంగా తనిఖీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు వారు కేటాయించిన రోడ్లు మరియు ప్రాంతాలను పూర్తిగా శుభ్రపరచి, సేకరించిన చెత్తను వెంటనే చెత్త తరలింపు వాహనాలకు అందజేయాలని ఆదేశించారు. అదేవిధంగా రోడ్లు శుభ్రపరిచిన అనంతరం చెత్తను రోడ్ల పక్కన లేదా ఒకేచోట పోగు చేయకుండా నేరుగా తరలింపు వాహనాలకు అందించాలని సూచించారు.
అలాగే పారిశుద్ధ్య కార్మికులందరూ సమయానికి విధులకు హాజరై, తమకు కేటాయించిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని తెలియజేశారు.ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు పారిశుద్ధ్య పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ పర్యటనలో నైట్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ గారు మరియు సంబంధిత సూపర్వైజర్లు పాల్గొన్నారు.