గోపాలపట్నం(స్వతంత్ర ప్రభ)
గోపాలపట్నం శాఖా గ్రంథాలయానికి మాధవధారకు చెందిన గొండు హర్ష వందన తన ఉన్నత చదువు నిమిత్తం ఉపయోగించిన విలువైన పుస్తకాల ను తిరిగి గోపాలపట్నం శాఖా గ్రంథాలయం లైబ్రేరియన్ ఎన్వి నరసింహంకు ఆమె తండ్రి అచ్యుత రావు ద్వారా అందజేశారు.ఈ సందర్భంగా దాత, సీనియర్ జర్నలిస్ట్ గొండు అచ్యుతరావు మాట్లాడుతూ గ్రంథాలయానికి విభిన్న రకాల పుస్తకాలను విరాళంగా ఇచ్చిన యెడల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
నేటి డిజిటల్ యుగంలో యువత ఈ పుస్తకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని లైబ్రేరియన్ నరసింహం కోరారు. దాతకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు డా.నేమాల హేమ సుందరరావు, గ్రంథాలయ సిబ్బంది స్థానిక పాఠకులు విద్యార్థులు పాల్గొన్నారు.పుస్తకాలను విరాళంగా ఇచ్చిన గొండు అచ్యుతరావును నరసింహం దుశ్శాలువాతో సత్కరించి అభినందించారు.