కాలువల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు

జెడ్.సి మల్లయ్య నాయుడుహెచ్చరిక

విశాఖ దక్షిణం (స్వతంత్ర ప్రభ)

జి.వి.ఎం.సి సౌత్ జోన్ జోనల్ కమిషనర్ ఏం. మల్లయ్య నాయుడు బుధవారం వార్డు 31, 32, 35 ప్రాంతాలలో విస్తృత పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్, కాన్వెంట్ జంక్షన్, బౌడారా రోడ్డు, వెలంపేట మున్సిపల్ స్టేడియం రోడ్డు, రాజా రామ్మోహన్ రాయ్ రోడ్డు ప్రాంతాలను పరిశీలించారు.పర్యటనలో భాగంగా చెత్త తరలించే వాహనాలు తడి చెత్త, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి తరలిస్తున్నారా లేదా అన్న విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే వాణిజ్య సముదాయాలు మరియు గృహాల నుండి చెత్త సేకరణ విధానం, చెత్త తరలించే వాహన డ్రైవర్ల ట్రిప్ షీట్లు, రోజుకు ఎన్ని ట్రిప్పులు నిర్వహిస్తున్నారన్న వివరాలను ఆరా తీశారు.ముఖ్యంగా వార్డు నెంబర్ 32 మరియు 35 ప్రాంతాలలో కొంతమంది వాణిజ్య సముదాయాలు కాలువలలో చెత్త వేయడాన్ని గమనించి, సంబంధిత వాణిజ్య సముదాయాలపై తక్షణం అపరాధ రుసుములు విధించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రజలు కాలువలలో చెత్త వేయకుండా తమ ఇళ్లకు వచ్చే చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే చెత్త అందించేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత సానిటరీ ఇన్స్పెక్టర్‌కు సూచించారు.ఈ పర్యటనలో వార్డు సానిటరీ ఇన్స్పెక్టర్ శివప్రసాద్, కీర్తి కామేశ్వర్ రెడ్డి మరియు సానిటరీ సెక్రటరీలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *