ఎమ్మెల్యే బొలిశెట్టి హామీ
పశ్చిమగోదావరి జిల్లా బ్యూరో (స్వతంత్రప్రభ)
కూటమి ప్రభుత్వం రైతులకు పూర్తి సహకారం అందిస్తుందని శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట లో కృషి అమృత భారత్ ఎఫ్. పి. సి.లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రంను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు. పండించిన ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో, ఏ మిల్లుకు వెళ్లాలో,డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు పూర్తి సహకారం అందించే విధంగా చర్యలు చేపట్టారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల ఆధ్వర్యంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమర్థవంతంగా పనిచేసి, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారన్నా రు. ధాన్యం అమ్మిన 24 గంటల్లో సొమ్ము రైతు ఖాతాలో జమఅవుతుందని చెప్పారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీ యమన్నారు. రెండు సంవత్సరాలుగా ఎలాంటి అంతరాయాలు లేకుండా రైతులకు మేలు చేస్తున్న జేసీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు తమ విధులను సమర్థంగా నిర్వహిస్తే నే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందన్నారు.పండించిన ధాన్యం రైస్ మిల్లులకు చేరిన వెంటనే, సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని, గత రెండేళ్లుగా రైతులు, అధికారులు కలిసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు.రవాణా ఖర్చుల విషయంలో కూడా ప్రభుత్వం సహాయం చేస్తోందని, ఇప్పటికే నియోజకవర్గానికి సుమారు రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం ద్వారా ధాన్యం అమ్మకానికి క్వింటాల్‌కు రూ.100 నుంచి రూ.150 వరకు అదనపు లాభం పొందే అవకాశం ఉందని తెలిపారు.రైతులు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, జేసీ ఫోన్ నంబర్, కంట్రోల్ రూమ్ నంబర్ ద్వారా ఎలాంటి సమస్యలైనా వెంటనే తెలియజేయాలని సూచించారు. ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తోందని, రైతులు,రైస్ మిల్లర్లు కలిసి సహకరిస్తే సమస్యలు సులభంగా పరిష్కారమ వుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వానికి సహకరిస్తున్న రైస్ మిల్లర్ల అసోసియేషన్ కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, బిజెపి సమన్వయకర్త ఈతకోట తాతాజీ, కృషి అమృత భారత్ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు , బిజెపి నాయకుడు కొండపల్లి నగేష్, ప్రభుత్వఅధికారులు,కూటమి నాయకులు పాల్గొన్నారు..