ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
(స్వతంత్ర ప్రభ) పశ్చిమగోదావరి జిల్లా బ్యూరో
వచ్చే రెండు నెలలు వేసవి కాలం దృష్ట్యా నీరు, విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టాలని శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అదూకారులను కోరారు. మండల పరిషత్ కార్యాలయం లో గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశానికి మండల పరిషత్ అధ్యక్షురాలు పొనుకుమాటి శేషులత అధ్యక్షత వహించా రు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో 53 చెరువు లు ఉండగా, 43 చెరువులు తవ్వకానికి అంచనాల రూపొం దించి పంపించినట్లు వెల్లడించా రు. ఈనెల 15 నుంచి కాలువలు కట్టివేస్తున్నందున పంచాయతీల్లో చెరువులు నింపుకోవాలని ఇరిగేషన్ ఏ ఈ బి.సుధారాణి సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఆరుగొలను, పెదతాడేపల్లిలో జలజీవన్ మిషన్ నిధులతో చేపట్టిన పనులను పూర్తి చేయాలని సభ్యులు కోరారు. సమావేశం లో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, వైస్ ఎంపీపీలు సూర్పని రామకృష్ణ, కట్టా రంగబాబు, తహసిల్దార్ తలారి రాజరాజేశ్వరి, ఎంపీడీవో వి.చంద్రశేఖరం, నోడల్ ఆఫీసర్ జి వి కె మల్లికార్జునరావు, ఏపీ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, చాపల రమేష్. వాడపల్లి సుబ్బరాజు. మద్దిపాటి రవితేజ. పసుమర్తి రామ్ లక్ష్మణ్. మద్దిపాటి ధర్మేంద్ర.అడపా ప్రసాద్ పలువురు ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీల కార్యదర్శులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, పంచాయతీల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.