ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలి

టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి

విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)

మహిళలను కించపరిచేలా, సభ్య సమాజం తలించుకునేలా ఏబీయన్ రాధాకృష్ణ ప్రసారం చేసిన వార్తలతో ఆ ఛానెల్ ఆంధ్రా బ్రోతల్ నెట్ వర్క్ లా తయారైందని, ఇలాంటి వారు మీడియాలో ఉండి సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారో చెప్పాలని వైఎస్సార్సీపీ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, పార్టీని, మఖ్యంగా పార్టీ నాయకుల భార్యలైన నీఛ నికృష్ణమైన బాషతో దూషించిన వైనాన్ని నిరసిస్తూ, ఏబియన్ రాధాకృష్ణపైన, ప్రచారం చేసిన వ్యక్తులందరిపైన చర్యలు తీసుకోవాలని స్థానిక వన్ టౌన్, టూ టౌన్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం మావిగన్ ప్రతిపాదనను తీసుకొచ్చారని,మా నాయకుడు అడుగుజాడల్లో నడుస్తూ మేమంతా మావిగన్ కు సపోర్ట్ చేస్తే వైఎస్సార్సీపీ నాయకులను కించపరుస్తూ ఏబీయన్ రాధాకృష్ణ కొత్తపలుకు కార్యక్రమంలో సంస్కారహీనంగా మాట్లాడారని, అలాంటి వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నామన్నారు.ఏబీయన్ రాధాకృష్ణపై మేము మాట్లాడుతుంటే అదేదో తప్పన్నట్లుగా సీయం, డిప్యూటి సీయంలు ట్విట్టర్ ద్వారా స్పందనలు తెలియచేస్తున్నారని, అయితే తమ పార్టీ నాయకుల రాసలీలలు ప్రతి 15 రోజులకొకసారి బయటకు వస్తున్నాయని,వాటిపై కూడా స్పందించాలన్నారు. అలా కాకుండా పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ వారికి డప్పు కొట్టే ఏబీయన్ కు సంపూర్ణ మద్దతును తెలుపుతూ ఇలా చేయడం సరికాదన్నారు.అమరాతి నిర్మాణం చేసేందుకు సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెబుతున్న నాయకులు అంత నగదు ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పాలని, ఇది ప్రజలపై భారం కాదా అని, మా నాయకుడు సూచించినట్లుగా అభివృద్దిలో ఉన్న ప్రాంతాన్ని రాజధానిని చేస్తే 10 శాతం ఖర్చుతో రాష్ట్రం మరింతగా అభివృద్ది చెందుతుందనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారని, దానిని ఏదో తప్పు చేసినట్లుగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేసి మరీ ఇలా వికృత కార్యక్రమాలతో ప్రజలను డైవర్షన్ చేసేలా చూస్తున్నారని, ఇది సమర్దించదగ్గ విషయం కాదన్నారు.మహిళలను కించపరిచిన రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని, మహిళాభివృద్దికి పెట్టపీట వేస్తున్నామని చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం రాధాకృష్ణ వ్యాఖ్యలపై ఏమి సమాధానం చెబుతారని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాధాకృష్ణకు మద్దతు తెలపడం దారుణమని, ఇదే పంథాలో కొనసాగితే ఆంధ్రరాష్ట్రంలో మహిళా లోకమంతా ఏబీయన్ ఛానెల్ ను బ్యాన్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్స్,వార్డ్ ప్రెసిడెంట్స్, జిల్లా నాయకులు, స్టేట్ నాయకులు, వార్డ్ నాయకులు, మహిళా నాయకురాలు,తదితరులు పాల్గొన్నారు,

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *