పేదల ఆకలి తీర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు

అల్లూరి జిల్లా, (స్వతంత్ర ప్రభ)
అరకు లోయలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ బుధవారం అరకలోయలో ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ద్వారా పేదల ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి బుధవారం అరకు లోయలో అరకు పార్లమెంట్ ఇంచార్జ్ తేజవతి, మరియు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సివేరి దోన్నుదొర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జులు,బూత్ ఇన్చార్జిలు,యూనిట్ ఇన్చార్జిలు, గ్రామ అధ్యక్షులు,జడ్పిటిసిలు,మాజీ జడ్పిటిసిలు, ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, రాష్ట్రస్థాయిలో వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు , డైరెక్టర్లు,తెలుగుదేశం పార్టీ అనుబంధ శాఖల్లో పనిచేస్తున్న నాయకులు, కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.ఎన్నికల సమయంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ అన్నా క్యాంటీన్ ద్వార పేదల ఆకలిని తీర్చే ప్రయత్నం చేస్తామని నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి బుధవారం అరకువాలీ లో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని వారన్నారు.