విశాఖ ఆణి ముత్యం మన డివి…
డాక్టర్ ఎస్ లక్ష్మీనారాయణ…
విశాఖ దక్షిణం (స్వతంత్ర ప్రభ)
భారతీయ జనతా పార్టీ, శ్రీ గాయత్రీ వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ సంయుక్త నిర్వహణలో ప్రకృతి చికిత్సలయ మహారాణిపేట ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ ఎస్ లక్ష్మీనారాయణ ముందుగా శ్రీ డివి సుబ్బారావు చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివి సుబ్బారావు విశాఖ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేశారని ఉడా చైర్మన్ , నగర మేయర్ , అఖిల భారత బార్ కౌన్సిల్ చైర్మన్ , క్రికెట్ బోర్డు మేనేజర్ గా విశాఖ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని అన్నారు.1932 ఏప్రిల్ 24 తేదీన పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు గ్రామంలో జన్మించారని, పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ చదువు వరకు ఏవీఎన్ కళాశాలలో విద్యాభ్యాసం చేశారని అన్నారు. 1957 సంవత్సరము లో బార్ కౌన్సిల్లో సభ్యుడిగా గా తన పేరును నమోదు చేసుకున్నారు అని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు లీగల్ అడ్వైజర్ గా సేవలందించారని, గురజాడ కళాక్షేత్రం, బీచ్ రోడ్ అభివృద్ధి, క్లీన్ అండ్ గ్రీన్, మొక్కల పెంపకము, వుడా పార్కు, ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీ, ఇందిరా ప్రియదర్శిని క్రికెట్ స్టేడియం పునర్ నిర్మాణము , పీఎం పాలెం క్రికెట్ స్టేడియం నిర్మాణము చేసి విశాఖ ప్రజలకు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లను ఘనంగా నిర్వహించారని అన్నారు. రైల్వే స్టేషన్ కు వాల్తేరు పేరును మార్పు చేసి విశాఖపట్నం పేరు గా మా ర్చటానికి కృషిచేసి సఫలీకృతులైనారని అన్నారు. నగరములో ఉన్న మురికివాడలలో మౌలిక సదుపాయాలను కల్పించారని, కొన్ని మురికి వాడాలను తరలించ అభివృద్ధి కి కృషి చేశారని అన్నారు. విశాఖకు సేవలందించిన డివి సుబ్బారావు కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ట చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ శ్రీ లక్ష్మి, , భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ వైద్య విభాగ కన్వీనర్ రూపాకుల రవికుమార్, నగర బిజెపి ఉపాధ్యక్షుడు చొక్కాకుల రాంబాబు, మహారాణి పేట బిజెపి మండల అధ్యక్షులు దేవర చంద్రశేఖర్, మైనార్టీ మోర్చా రాష్ట్ర సభ్యులు ఓ ఆల్బర్ట్, టాంక్ అవతార్ సింగ్, అన్సారి, సుశీల, ఎస్ పూజిత, ఎస్ .దుతి, గేదెల శ్రీహరి, మరగడ గౌరీ రెడ్డి, రమణ, బంగారమ్మ మొదలగు వారు పాల్గొన ఘన నివాళులర్పించారు.