కైలాసగిరి పై ఘనంగా వద్ద ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ కార్యక్రమం

విశాఖ తూర్పు, (స్వతంత్ర ప్రభ)

విశాఖ జిల్లా బిజెపి అధ్యక్షులు పరుశురామ్ రాజు అధ్యక్షతన కైలాసగిరి కొండపై నూతనంగా నిర్మించిన త్రిశూల్ వద్ద ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు..సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలోనే, కైలాసగిరిపై త్రిశూల్ ఏర్పాటు కావడం శుభపరిణామమని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుతో సింహాచలం కొండలో భాగమైన కైలాసగిరి పూర్తిస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. కైలాసగిరిపై అత్యంత ప్రతిష్టాత్మకంగా త్రిశూలాన్ని ఏర్పాటు చేసినందుకు వి ఎం ఆర్ డి ఎ కు ఆయన అభినందించారు.75 ఏళ్ల క్రితం సర్దార్ వల్లభాయ్ పటేల్ సారథ్యంలో సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగిందని, అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా అది ప్రారంభమైందని గుర్తు చేశారు. వందల ఏళ్ల దాడుల వల్ల కోల్పోయిన అస్తిత్వాన్ని పునర్నిర్మాణం ద్వారా ఆ ఆలయం తిరిగి పొందిందని వివరించారు.ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా జ్యోతిర్లింగ క్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. మోదీ పిలుపు మేరకు ‘స్వాభిమాన్ పర్వ్’తో పాటు ‘స్వాభిమాన్ జాగరణ’ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో వివక్ష లేని పాలన సాగుతోందని,తెలంగాణలో ఇటీవల ప్రధాని పాల్గొన్న అభివృద్ధి కార్యక్రమాలే దీనికి నిదర్శనమని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ‘ట్రిపుల్ ఇంజన్’ సర్కార్ నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.తమిళనాడు నూతన సి. ఎం ప్రమాణస్వీకారం చేసిన జోసఫ్ విజయ్ కి అభినందనలు తెలుపుతూనే.. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ముస్లిం లీగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోదీ, అమిత్ షా నేతృత్వంలో దేశంలో ఉగ్రవాద అణచివేత నిర్దాక్షిణ్యంగా జరుగుతోందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మిడి సుజాత రాజ్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి ఏం.నాగేంద్ర, బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ ఏ.కేశవకాంత్, బీజేపీ పార్వతీపురం జిల్లా ఇంచార్జి ఎస్.వి.ఎస్ప్రకాష్ రెడ్డి, బీజేపీ శ్రీకాకుళం జిల్లా ఇంచార్జి ఎన్.విజయానంద రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుద్ధ లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర బిల్డింగ్ కమిటీ మెంబెర్ బొచ్చా సురేష్ కుమార్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం ధనేశ్వర రావు, బిజెపి మీడియా కన్వీనర్ టీ కోటేశ్వరరావు,జిల్లా సోషలమీడియా కన్వీనర్ రాకేష్,బీజేపీ తూర్పు నియోజకవర్గం ఇంచార్జి రవిరాజ్ , ఎస్సీ నాయకులు చొక్కాకులా రాంబాబు మరియు బిజెపి రాష్ట్ర మరియు జిల్లా,నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *