తెప్ప బోట్లు, వలలతో వినూత్న రీతిలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి నిరసన
విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)
ఇప్పటి వరకు ఎంత మంది తమ గంగపుత్రులకు “మత్స్యకార భరోసా” పథకం ద్వారా నగదు ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. అర్హులైన మత్స్యకార కుటుంబాలు అందరికీ మత్స్యకార సేవలో నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 31 వార్డు అధ్యక్షుడు దొడ్డి బాపు ఆనంద్ అధ్యక్షతన, వైసిపి నియోజకవర్గ పరిశీలకులు వీసం రామకృష్ణ సమక్షంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ దక్షిణ వైఎస్ఆర్సిపి శ్రేణులతో కలిసి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రెండు తెప్ప బోట్లు, వలలతో వినూత్న రీతిలో శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దక్షిణ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గణేష్ కుమార్ మాట్లాడుతూ జగనన్నే మా గంగపుత్రులకి దేవర అని అన్నారు. రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ లాండింగ్ సెంటర్స్ నిర్మించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అని చెప్పారు. ఒక్కో ఫిషింగ్ హార్బర్ కి 500 కోట్లు చొప్పున కేటాయించారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పోర్టులను ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. మత్స్యకారులను గత 40 సంవత్సరాలుగా చంద్రబాబునాయుడు మోసం చేశారని, ఇప్పుడు లోకేష్ కూడా మోసం చేస్తున్నారన్నారు. మత్స్యకారుల తండ్రి కొడుకులు మత్స్యకారులను మోసం చేశారని మండిపడ్డారు. గత ఏడాది పూర్తిగా ఇవ్వకుండా, రెండోవ ఏడాది మత్స్యకార భరోసా పథకం 30% ఎగ్గొట్టి , ఈ ఏడాది టెక్నికల్ పేరుతో పూర్తిగా 50 శాతం పైగా చంద్రబాబు తమ మత్స్యకారులను అనర్హులుగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మత్స్యకారులను రెండు నెలలుగా వేటకు వెళ్ళకుండా ఉన్నందుకు జీవన భృతికి హక్కుగా ఇస్తున్న 20వేలును కూడా చంద్రబాబు చిన్న చూపు చూడడం సరికాదన్నారు. తమ గంగపుత్రుల కుల దేవతలు శాపం తగులుతాదని వాసుపల్లి హెచ్చరించారు. ప్రతి ఎజెండాలో మత్స్యకారులకు ఐదు కిలోమీటర్లు జెట్టి, ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం, మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని చంద్రబాబు ప్రగల్భాలు పలికాడని తెలిపారు. మత్స్యకారులను నా ఎదురుగానే చంద్రబాబు తాటతీస్తాను, తోలు తీస్తానని అన్నాడని ఆరోపించారు. చంద్రబాబు మత్స్యకారులకు ఇచ్చే గౌరవం ఇదేనా అన్నారు. చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలనలో 3లక్షల
కోట్ల అప్పు తెచ్చాడని తెలిపారు. కేవలం 47వేల కోట్లు అమరావతి పెట్టినట్టు వెల్లడించారు. చంద్రబాబు పాలనలో ఒక్క ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5లక్షల మత్స్యకారులు ఉంటే కేవలం 1లక్ష 30వేల మందికి మత్స్యకార సేవలో ఇచ్చి చంద్రబాబు నాయుడు భుజాలు ఎగురవేస్తున్నారని ఎద్దేవా చేశారు. దీంతో మిగిలిన మత్స్యకారులు వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ పథకాల్లో బినామీ పేర్లతో పేదల డబ్బు దారి మల్లిస్తున్నారని ఆరోపించారు.కూటమి ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకాన్ని అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తక్షణమే మత్స్యకార సేవలో నిధులు విడుదల చేసి మత్స్యకారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు*. లేని పక్షంలో త్వరలో జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్లడిస్తాని హెచ్చరించారు.నిరసనలో చేపల సుంకాను పట్టుకుని చోడిపిల్లి శివ, చేపల నూకరాజు (బుడ్డి) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, మాజీ కార్పొరేటర్ కోడిగుడ్లల శ్రీధర్,తోట పద్మావతి,బిపిన్ జైన్,వార్డ్ ప్రెసిడెంట్ , పీతల వాసు, దశమంతులు మాణిక్యాలరావు , పిన్నింట్ల రాజారెడ్డి, ముత్తాబత్తుల రమేష్, మహమ్మద్ షకిల్, గురజారపు రవి, ముజీబ్ ఖాన్,భీశెట్టి ప్రసాద్, స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రెటరీ లింగం శ్రీను,మాజీ కో ఆప్షన్ నెంబర్ షరీఫ్,మాజీ కార్పొరేటర్ పత్తిరపల్లి రాము, జిల్లా జనరల్ సెక్రెటరీ గనగల రామరాజు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ రాజు,జిల్లా సెక్రటరీ అభిరెడ్డి ఆది విష్ణు రెడ్డి, పద్మనాభం అమ్మాజీ, స్టేట్ బీసీ నాయకులు లండ రమణ, స్టేట్ నాయకులు పరవాడ ఈశ్వర్, దస్మంతుల చిన్ని, వేలంగిని రావు, భానుమూర్తి, బోరా విజయలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, సాగర్, ఈతలపాక విజయ్ భాస్కర్,జిల్లా ప్రెసిడెంట్ వడ్డాది దిలీప్, జిల్లా అనుబంధ సంఘాల వైస్ ప్రెసిడెంట్లు కోన శంకర్, దూడ అప్పారావు,గుంటు ఆనంద్,సౌత్ అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు బోనుగు రాజా పాత్రుడు,తాడి రవితేజ,జీరు సుధా,ఆకుల శ్యామ్,సువార్త రాజు, సూరపతి అప్పన్న, బొండాడ వెంకట్రావు,బేవార మహేష్,పిల్లా అప్పారావు, మహమ్మద్ యాసిన్ (బాబ్జి ),మళ్ళా విజయ్, వాసుపల్లి బంగారమ్మ, కడవల నాగమణి, సూర్య, గరికిన చంద్రశేఖర్, వి.టి.కృష్ణ కుమార్,జిల్లా నాయాకులు నీలపు లక్ష్మి, పెద్దగాడా బాబ్జి,పెదబాబు, జిల్లా అనుబంధ సంఘాల, సౌత్ అనుబంధ సంఘాల,వార్డ్ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.