మున్సిపల్ కార్పొరేషన్ వైఫల్యంపై డా. సీపాన గుణవతి తీవ్ర ఆగ్రహం
శ్రీకాకుళం, మార్చి 6 (స్వతంత్ర ప్రభ)

శ్రీకాకుళం పట్టణంలో కలుషిత తాగునీరు, పారిశుద్ధ్య లోపాల కారణంగా వ్యాపిస్తున్న డయేరియా వ్యాధి పట్ల జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్, సంఘసేవకురాలు డాక్టర్ సీపాన గుణవతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.శుక్రవారం నాడు ఆమె మీడియా కు ఈ విషయం తెలిపారు.ప్రజల నుంచి భారీగా పన్నులు వసూలు చేస్తూ, కనీసం పరిశుభ్రమైన తాగునీరు అందించలేకపోవడం శ్రీకాకుళం మునిసిపల్ కార్పొరేషన్ ఘోర వైఫల్యమని ఆమె మండిపడ్డారు. కాలువలు మరమ్మాత్తులు చేసినప్పుడు మంచినీటి కోలాయి ల ద్వారా సరపరా అవుతున్న మంచినీరు నిలుపు చేసి, ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేయాలానే కనీస అవగాహన అధికారులకు లేకపోవటం విచారకరమని అన్నారు.“ప్రజల ప్రాణాలు అంత తక్కువవా? పన్నులు మాత్రమే వసూలు చేసి, సేవలు మాత్రం ఇవ్వకపోవడం అన్యాయం కాదా ?” అని ఆమె ప్రశ్నించారు.పట్టణంలోని అనేక కాలనీలు, వీధుల్లో చెత్త పేరుకుపోవడం, మురుగు కాల్వలు మూసుకుపోవడం, దోమలు–విషకీటకాలు విస్తరించడం వల్ల ప్రజలు భయాందోళనలో జీవిస్తున్నారని ఆమె తెలిపారు. మురికికాలువలు శుభ్రం చేయకపోవడం వల్ల దుర్గంధభరిత వాతావరణం ఏర్పడుతోందని, ఇది ఆరోగ్యానికి తీవ్ర ముప్పని పేర్కొన్నారు.గత ఏడాది నుంచే పలు సంఘాలు, ప్రజాప్రతినిధులు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆమె తీవ్రంగా విమర్శించారు. డయేరియా మృతులు సంభవించడం బాధాకరం మాత్రమే కాదు, ఇది పరిపాలనా నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆమె అభిప్రాయపడ్డారు. ఏ అధికారుల నిర్లక్ష్యం వలన ప్రాణ నష్టం జరిగినా చట్ట పరంగా వారి పై క్రిమినల్ చర్యలు తీసుకోవటం అవసరమని అన్నారు.“ప్రజల ప్రాణాలకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఎంత ఉన్నా, అది కోల్పోయిన ప్రాణాలకు ప్రత్యామ్నాయం కాదు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయడమే కాకుండా, ఇకపై ఇలాంటి పరిస్థితులు రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలి” అని డా. గుణవతి డిమాండ్ చేశారు. పట్టణంలో పరిశుభ్రత ను పరోశీలించటానికి అధికారులు, నాయకులు కారుల్లో కాకుండా, పురవీదుల్లో నడిచి తిరిగినట్లయితే పట్టణంలో వెదజళ్లే దుర్గంధపురితమైన వాతావరణం కనిపిస్తుందని అన్నారు.కలుషిత నీటి సరఫరాను తక్షణమే నిలిపివేయాలి ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలిమురుగుకాలువలు, చెత్త నిల్వలను వెంటనే శుభ్రపరచాలి కీటకనాశన మందులు పిచికారీ చేసి వ్యాధి వ్యాప్తిని అరికట్టాలి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి ఈ పరిస్థితి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమేకాక, మానవ హక్కుల స్పష్టమైన ఉల్లంఘన అని డాక్టర్ సీపాన గుణవతి స్పష్టం చేశారు.శ్రీకాకుళం పట్టణంలో జరిగిన దయారియా మృతుల ఘటన రాజ్యాంగ స్ఫూర్తి కే విరుద్దామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అడ్వైజర్ లొకినింది గోవిందరాజులు అన్నారు.“ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వని వ్యవస్థను ప్రజలే ప్రశ్నిస్తారని ఆయన తెలియదు .ఇక మౌనం ఉండం. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత” అని గుర్తు చేశారు. ప్రజల ప్రణాలకు భద్రత కల్పించలేని అధికారులు మానవ హక్కులను ఉల్లాంఘినుంచటమే అవుతుందని హెచ్చరించారు.