ఒమేగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీ శుభాకర రావు

విశాఖ తూర్పు, మార్చి 06(స్వతంత్ర ప్రభ)

వైద్య రంగంలో ప్రపంచం  ఎంతో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని దానికి అనుగుణంగా రోగులకు ఉత్తమమైన వైద్య సేవలు అందించడమే ఒమేగా హాస్పిటల్ లక్ష్యం అని ఒమేగా హాస్పిటల్ విశాఖపట్నం సెంటర్ హెడ్ శ్రీ శుభాకర రావు అన్నారు.. హాస్పిటల్  నిర్వహణ లో 20 సంవత్సరాల పైన అనుభవం కలిగిన శుభకర రావు విశాఖపట్నం ఒమేగా హాస్పిటల్ నందు అడ్మినిస్ట్రేటర్ గా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా పలువురు ఆయన కు  పుష్పగిచ్చాలు అందజేసి  స్వాగతం పలికారు..ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వైద్య పథకాలు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు అందిస్తున్న సేవలను, తమ ఒమేగా హాస్పిటల్ ద్వారా అందించడానికి మా యాజమాన్యం ఎల్లప్పుడు ముందుంటుంది అన్నారు. రోగులకు 24/7 అందుబాటులో ఉండే విధంగా, నిపుణులైన వైద్య బృందం, అత్యాధునిక టెక్నాలజీ, అతి తక్కువ ఖర్చుతో, ఖచ్చితత్వం తో మరియు  పర్సనల్ టచ్ తో కూడిన వైద్య సేవలు ఒమేగా హాస్పిటల్ లో అందుబాటులో ఉన్నాయి. విశాఖపట్నం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.. రాబోయే రోజుల్లో ఉచిత మెడికల్ క్యాంపు లు కూడా తమ ఆసుపత్రి ద్వారా నిర్వహిస్తామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *