శ్రీ స్వామి వివేకానంద హై స్కూల్ యాజమాన్యం అభినందనలు
విశాఖపట్నం (స్వతంత్ర ప్రభ)
శ్రీ స్వామి వివేకానంద హై స్కూల్ లో యు కే జి చదువుతున్న వై. వేదాన్షీ అనే విద్యార్థిని కి విశాఖపట్నం లో మార్చి 1వ తేదీన జరిగిన 15 ఏపీ స్టేట్ వాడికే కరాటే చాంపియన్ షిప్- 2026. లో సిల్వర్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ దాసరి రేణు మరియు కరస్పాండెంట్ దాసరి మురళి కృష్ణ విద్యార్థి యొక్క ప్రతిభ మెచ్చుకొని, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టాలెంట్ ఉన్న విద్యార్థులకు తమ స్కూలు ఎప్పుడు ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. స్కూల్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.