

గాజువాక మార్చి06 (స్వతంత్ర ప్రభ)
మహిళలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలంటే ప్రతి మహిళ స్వశక్తి పై ఆధారపడాలని అప్పుడు మహిళల్లో చైతన్యం పెరుగుతుందని. శ్రీహరిపురం డి పి ఎస్ కిడ్స్ స్కూల్ ప్రిన్సిపాల్ కొత్తపల్లి పుష్పలత అన్నారు.. ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం డి పి ఎస్ కిడ్స్ స్కూల్ ఆవరణలో. మహిళా దినోత్సవం వేడుకలను ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సమాజంలో మహిళలు ఏ విధంగా ఎదగాలి కుటుంబానికి మార్గదర్శకంగా ఏ విధంగా ఉండాలి అన్న అంశాలపై ఆమె మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.. అనంతరం స్కూల్ చిల్డ్రన్స్ వివిధ సంస్కృతి కార్యక్రమాలు ప్రదర్శించారు.. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ పుష్పలత పలువురు మహిళలను గౌరవంగా సత్కరించారు..ఈ కార్యక్రమంలో డి పి ఎస్ కిడ్స్ స్కూల్ సిబ్బంది.. విద్యార్థులు. వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.