ఒమేగా హాస్పటల్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు 

మహిళ దినోత్సవం పురస్కరించుకొని ప్రత్యేక ఆఫర్ ప్రవేశపెట్టిన ఒమేగా హాస్పటిల్ ఒమేగా హాస్పటల్,

విశాఖపట్నం 07(స్వతంత్ర ప్రభ)

విశాఖపట్నం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను హాస్పటల్ మేనేజింగ్ డైరక్టర్ . డా. బి. రవిశంకర్ గారు, ప్రముఖ సంఘసేవకురాలు  శేషుమాంబ గారు, క్యాన్సర్ వైద్య నిపుణులు, డా. నీలిమ గారు, హాస్పటల్  చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్  శ్రీ శుభాకర రావు గారు లు ఈ కార్యక్రమానికి అతిధులుగా విచ్చేసి వేడుకలను ప్రారంభించారు. ఈసందర్భంగా గా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా. రవిశంకర్ గారు మాట్లాడుతూ ప్రధానంగా మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా రంగాల్లో చేసిన కృషి మరువలేనిది, ఆడవారికి కూడా సమాన హక్కులు, అవకాశాలు ఈ సమాజంలో కల్పించడానికి, వారిలో అవగాహన పెంచడానికి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎంతో ముఖ్యమని, మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలను కల్పించాలని పిలుపునిచ్చారు. శేషుమాంబ మాట్లాడుతూ సమాజంలో స్త్రీల పైన అనేక అఘాయత్యాలు జరుగుతున్నాయి మహిళలు వాటిని ధైర్యంగా ఎదుర్కొని పోరాడి ఎదురు నిలబడాలని ఆకాక్షించారు. ప్రతి మహిళా తన కుటుంబ సభ్యుల బాధ్యతలను నిర్వహిస్తూ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అవసరమైనవారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇస్తానని తెలిపారు. మహిళలు యోగా లాంటివి నేర్చుకోవాలని హితవు పలికారు. ముఖ్య అతిథి డాక్టర్ నీలిమ  గారు మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యక్తి జీవితంలో స్త్రీ చాలా పాత్రలు పోషిస్తుంది. తల్లి మొదలు, చెల్లి, భార్య, గురువు ఇలా ఎన్నో బాధ్యతలను ఆమె అలవోకగా చేయగలదు. ఆమెలోని గొప్పదనం ఏమిటంటే ఓ వైపు ఇంటిని చక్కబెడుతూనే మరోవైపు సంఘంలోనూ ఎన్నో పాత్రలు పోషిస్తుంది. మగవారికి సమానంగా  బాధ్యతలను కూడా ఆమె స్వీకరించి వందశాతం వాటికి న్యాయం చేస్తుంది. నేటి కాలంలో స్త్రీలు సాధించిన విజయాలు నిజంగా ఆకాశాన్నంటాయనీ వీటన్నింటికి ప్రతీకగా  మహిళా దినోత్సవమును జరుపుకుంటున్నామని, మహిళలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం అవసరమని వీటికోసం సమయం కేటాయించాలని తెలిపారు.హాస్పటల్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ శుభాకర రావు గారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని తెలియజేశారు. మహిళలు అనేక రంగాల్లో ప్రతిభ చాటుతూ సమాజ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలియజేశారు. సమాజ అభివృద్ధికి, కుటుంబ బాంధవ్యాలకు మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. ఒక వైపు ఉద్యోగం  చేస్తూ, తన బాధ్యతను నిర్వహిస్తూ,  మరొకవైపు మహిళగా , తల్లిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు .ఈ కార్యక్రమంలో కార్గిల్ యుద్ధంలో మరణించిన వీర సైనికుల కుటుంబాల మహిళల ను, వారు చేసిన త్యాగాలను గుర్తించి వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ ఉమెన్స్ డే సందర్భంగా స్త్రీలకు కానుకగా ఒమేగా హాస్పిటల్ లో ఒక ప్రత్యేక హెల్త్ చెక్ పాకేజ్ ని ప్రకటించారు .రూ. 7000 ల వరకు విలువచేసే టెస్టులను కేవలం రూ. 999 లకు అందించడం జరుగుతుంది అని తెలియచేసారు. ఈ అవకాశం విశాఖపట్టణం మరియు పరిసరప్రాంత ప్రజలు ఉపయోగించు కోవాలని ఒమేగా హాస్పిటల్ కోరుకుంటున్నది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒమేగా హాస్పిటల్ సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

oplus_2
WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *