ముఖ్య అతిథిగా పాల్గొన్న సీతంరాజు సుధాకర్

విశాఖ దక్షిణం (స్వతంత్ర ప్రభ)
విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలోని 36వ వార్డు, సున్నపు వీధి వద్ద శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ కనక మహాలక్ష్మి మహిళా మండలి అధ్యక్షురాలు కేదారి లక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక మహిళలు మరియు టీడీపీ నాయకుల సమక్షంలో అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్చార్జ్ సీతంరాజు సుధాకర్ ని స్థానిక మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలతో ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుధాకర్ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థ బలంగా నిలవడానికి మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. తల్లి, అక్క, చెల్లి, భార్య వంటి ప్రతి రూపంలో మహిళలు కుటుంబానికి ధైర్యం, ప్రేమ, మార్గదర్శకత్వం అందిస్తారని పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలో కూడా మహిళలు ఎన్నో గొప్ప సేవలు చేశారని తెలిపారు.సరోజినీ నాయుడు స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, మదర్ తెరిసా మానవ సేవకు ప్రతీకగా నిలిచారని, సావిత్రిబాయి పూలే మహిళల విద్య కోసం విశేష కృషి చేశారని గుర్తుచేశారు. అలాగే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మహిళల హక్కులు,సమానత్వం కోసం చేసిన సంస్కరణలను ఈ సందర్భంగా వివరించారు.అలాగే దేశ భద్రతలో కూడా మహిళలు ముందంజలో ఉన్నారని, వివిధ సైనిక కార్యక్రమాలలో మహిళలు తమ ప్రతిభను నిరూపిస్తున్నారని తెలిపారు. మహిళల ప్రతిభను గుర్తిస్తూ ప్రభుత్వం కూడా వారికి వివిధ పురస్కారాలు, పతకాలు అందజేస్తూ ప్రోత్సహిస్తున్నదని చెప్పారు.మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో భారతదేశంలో (విమెన్స్ రిజర్వేషన్ బిల్లు) ద్వారా రాజకీయాల్లో 33% రిజర్వేషన్ కల్పించడం ఒక చారిత్రాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు. చివరగా సమాజ అభివృద్ధి కోసం మహిళలు ముందుకు రావాలని, ప్రతి రంగంలో మహిళలు విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో శ్రీ కనకమహాలక్ష్మి దేవాలయ ఈవో శోభ రాణి,ప్రముఖ సినీ రచయిత్రి జాలాది విజయలక్ష్మి ,కష్ట ఇన్చార్జ్ కదల లక్ష్మి,టీఎల్ఎఫ్ రమణమ్మ,దాడి రామలక్ష్మి, ఆదిలక్ష్మి,సుశీల,అచ్చమ్మ,చంద్రకళ ,నూక రత్నం , వేణు కుమారి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.