కేజీహెచ్ ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి

చికిత్స పొందుతున్న బాలుడు కుటుంబానికి 10వేలు సాయం

విశాఖ దక్షిణం (స్వతంత్ర ప్రభ)

ప్రజా సమస్యలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులలో అడుగడుగున నిర్లక్ష్యం కల్పిస్తుందని ధ్వజమెత్తారు.ముఖ్యంగా విశాఖ పెద్ద ఆసుపత్రి కేజీహెచ్ లో ఈ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.ఎప్పుడు లడ్డు విషయం తప్ప ఇక రాష్ట్రంలో వేరే విషయాలు ఏమీ లేవా, ప్రజా సమస్యలు పట్టవా అంటూ ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.ద్వారకా నగర్ ప్రాంతంలో ఓ బాలుడు ఆడుకుంటుండగా ప్రమాదవశాస్తూ గోతిలో పడి కాలు విరగడంతో కుటుంబ సభ్యులు అతనిని కేజీహెచ్ కు తీసుకువచ్చారని చెప్పారు. అయితే వైద్య సిబ్బంది మంచి దృక్పథంతో సర్జరీ చేశారన్నారు. శస్త్ర చికిత్స సందర్భంగా మోతాదుకు మించి మత్తుమందు ఇవ్వడంతో ఆ బాలుడు కోమాలోకి వెళ్లాడనే ఆరోపణ వస్తున్నాయని చెప్పారు.శనివారం కేజీహెచ్ కి వెళ్లి,అక్కడ చికిత్స పొందుతున్న వానపల్లి అక్షయ కుమార్ (6) బాలుడి పరిస్థితులు వాసుపల్లి గణేష్ కుమార్ పరిశీలించారు.కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఆ కుటుంబానికి  రూ.10వేలు ఆర్థిక సహాయం చేశారు.ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ విశాఖ కేజిహెచ్ తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు.తమ వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్యం అందేదని పేర్కొన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు అన్ని మారిపోయావని ద్వజమెత్తారు.కేజీహెచ్ పై ప్రభుత్వ పర్యవేక్షణ లేదని చెప్పారు. కేజీహెచ్ లో ఎప్పుడూ సమస్యలు తాండవిస్తున్నాయని అన్నారు. ఇక్కడ సమస్యల పరిష్కారం కోసం సరైన చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. ప్రస్తుతం వైద్యుల నిర్లక్ష్యం వల్ల కోమాలో ఉన్న బాలుడు ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆంధ్ర మెడికల్ కళాశాల, కాలేజీ ఆఫ్ నర్సింగ్, స్కూల్ ఆఫ్ నర్సింగ్, కేజీహెచ్ అనుబంధ ఆసుపత్రులలో విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు బకాయి ఉన్న పది నెలల జీతం తక్షణమే వారికి  అందేలా చూడాలని వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *