శానిటరీ ఇన్‌స్పెక్టర్ కీర్తి ఆధ్వర్యంలో వ్యర్థాల విభజనపై ఇంటింటికీ అవగాహన

విశాఖ దక్షిణం, మార్చి :14 (స్వతంత్ర ప్రభ)

స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో భాగంగా విశాఖ నగరాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు జివిఎంసి అధికారులు క్షేత్రస్థాయిలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా, సౌత్ జోన్ 32వ వార్డు పరిధిలోని అల్లిపురం ప్రాంతంలో శనివారం పారిశుధ్యంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు.జివిఎంసి కమిషనర్, ఏడీసీ మరియు జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు ఆదేశాల మేరకు వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ కీర్తి ఆధ్వర్యంలో సిబ్బంది ఇంటింటికీ తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా వ్యర్థాలను విచక్షణారహితంగా పారవేయకుండా… తడి, పొడి, ప్రమాదకర మరియు శానిటరీ వ్యర్థాలుగా నాలుగు రకాలుగా విభజించి, నాలుగు వేర్వేరు బిన్లలోనే మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో మేస్త్రీలు, సూపర్‌వైజర్లు మరియు పారిశుధ్య కార్మికులు పాల్గొని, స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యర్థాల విభజన పాటించాలని అధికారులు కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *