కడపలో ఘనంగా ప్రపంచ వినియోగదారుల దినోత్సవం వేడుకలు

కడప , మార్చి :15(స్వతంత్ర ప్రభ)

ది నేషనల్ కన్జ్యుమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవం వేడుకలు కడపలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కమిషన్ స్టేట్ చైర్మన్ మద్దెల సురేష్ బాబు ఆధ్వర్యంలో కడపలోని నిర్మల కాలేజ్ లో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ చైర్మన్ డా. సాయి రమేష్ హాజరై వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువులపై తప్పనిసరిగా బిల్ తీసుకోవాలని, నాణ్యత లేని వస్తువులు లేదా సేవలు అందించినప్పుడు వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చని తెలిపారు.అలాగే కార్యక్రమానికి హాజరైన కడప మున్సిపాలిటీ కమిషనర్, లీగల్ మెట్రాలజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ రెడ్డి, అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ ఆశా, టీ. డి. పి. డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ హరిప్రసాద్, కమీషనర్ రాకేష్ చంద్రా,హెల్త్ ఆఫీసర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు, కమీషనర్ రాకేష్ చంద్రా మాట్లాడుతూ వినియోగదారుల రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఫుడ్ సేఫ్టీ, మెడిసిన్స్ నాణ్యత, తూకం కొలతలలో పారదర్శకత వంటి అంశాలపై విద్యార్థులకు మరియు ప్రజలకు అవగాహన కల్పించారు.అదేవిధంగా కన్జ్యుమర్ కోర్ట్ డీసీడీఆర్‌సీ మెంబర్ మురళి క్రిష్ణ మాట్లాడుతూ వినియోగదారుల కోర్టులో కేసులు ఎలా వేయాలి, ఫిర్యాదు చేయడానికి అవసరమైన పత్రాలు ఏమిటి, వినియోగదారులు తమ హక్కులను ఎలా వినియోగించుకోవాలి అనే అంశాలపై వివరంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, అక్రమాలు గమనించినప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని స్పీకర్లు సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అతిథులు అభినందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ది ఎన్. సి. ఆర్. సి.డిస్ట్రిక్ట్ చైర్మన్ కిషోర్, వైస్ చైర్మన్ కోట.సుబ్బారావు,సుబ్బారెడ్డి,బి. సురేష్, రాధాకృష్ణ, శివ, చంద్రశేఖర్,అమరావతి రాజు, చలపతి, ఉమామహేశ్వర్ రావు, బాలకృష్ణ, కళాశాల. ప్రిన్సిపాల్ డా!మోహన్ కుమార్

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *