విశాఖపట్నం,మార్చి:15 (స్వతంత్ర ప్రభ )
విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (ప్రజా దర్బార్)లో చైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ నేరుగా పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, సోమవారం ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు తానే స్వయంగా అందుబాటులో ఉండి ప్రజల నుండి వినతులు స్వీకరిస్తానని తెలిపారు. ముఖ్యంగా వీఎంఆర్డీఏకు సంబంధించిన అన్ని రకాల సమస్యలపై మాత్రమే ఫిర్యాదులు స్వీకరించి, వాటిని సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేక కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. నగర వాసులు మరియు వీఎంఆర్డీఏ పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ ఈ సందర్భంగా కోరారు.