గాజువాక,మార్చి:15 (స్వతంత్ర ప్రభ)
గ్రేటర్ విశాఖ పట్నం మున్సిపల్ కార్పొరేషన్ 73వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి భూపతి రాజు సుజాత కు విశాఖ కళాపరిషత్ ఆధ్వర్యంలో ఉత్తమ మహిళా కార్పొరేటర్ ఉగాది పురస్కార్ 2026 అవార్డ్ ను ప్రధానం చేశారు.ప్రజలకు అందించిన సేవలను గుర్తించి ఈ అవార్డును అందజేసినట్లు. విశాఖ కళా పరిషత్ అధ్యక్షులు జె వి కె అప్పలరాజు తెలిపారు.
వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా ఆదివారం గాజువాకలో జరిగిన అభినందన సభ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు… కార్యక్రమంలో ఉత్తమ మహిళ కార్పొరేటర్ .ఉగాది పురస్కార్ 2026 అవార్డు ను విశాఖ కళా పరిషత్ అధ్యక్షులు జెవికె అప్పలరాజు. వైఎస్ఆర్సిపి రాష్ట్ర
పి ఏ సి సభ్యులు గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి చేతులు మీదుగా అందజేసారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ. సమాజంలో మహిళలు అభివృద్ధి చైతన్యానికి కృషి చేస్తున్న మహిళా నాయకులను ప్రోత్సహించడం అవసరమన్నారు. కళా సంస్కృతిక సంస్థలు సమాజంలో చైతన్యం కలిగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని ఇలాంటి స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వాలు ప్రోత్సాహం అందించాలని ఆయన కోరారు.భూపతి రాజు సుజాత మాట్లాడుతూ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. ప్రజలు సమస్యలను పరిష్కరించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా సేవే తనకు ప్రాధాన్యమని మహిళలు అభివృద్ధి సంక్షేమము కొరకు మరింత కృషి చేస్తానని చెప్పారు. ఈ అవార్డు తనపై ఉన్న బాధ్యతను మరింత పెంచిందని ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని ఆమె తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గాజువాక ఇంచార్జ్ వైసిపి నాయకులు తిప్పల దేవన్ రెడ్డి,రాష్ట్ర నాయకులు భూపతిరాజు, శ్రీనివాసరాజు గాజువాక నాయకులు,కార్యకర్తలు.క్షత్రియ అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని భూపతిరాజు సుజాతను సాలువాలు తో సత్కరించి. పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె చేసిన సేవలకు పలువురు కొనియాడారు..