రంజాన్ సందర్భంగా చీరల పంపిణీ
విశాఖ దక్షిణం (స్వతంత్ర ప్రభ)
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 39వ వార్డు అధ్యక్షులు ఎండీ ముజీబ్ ఖాన్ తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. సోమవారం వార్డు పరిధిలోని మహిళా పారిశుద్ధ్య కార్మికులకు ఆయన గౌరవపూర్వకంగా చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ముజీబ్ ఖాన్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ మైనార్టీల సంక్షేమానికి, పేదల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని కొనియాడారు. సమాజం కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పండుగ వేళ అండగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవడమే తమ పార్టీ ప్రధాన ఆశయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ మైనార్టీ నాయకులు, స్థానిక పార్టీ కార్యకర్తలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తమ కష్టాన్ని గుర్తించి గౌరవించినందుకు మహిళా కార్మికులు ముజీబ్ ఖాన్కు కృతజ్ఞతలు తెలిపారు.