విశాఖలో ‘బిజెపి వారిది’ కార్యక్రమం
విశాఖపట్నం,మార్చి:16(స్వతంత్ర ప్రభ)
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఒక వారధిలా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన “ప్రభుత్వానికి ప్రజలకి వారధి – భారతీయ జనతా పార్టీ వారిది” కార్యక్రమం సోమవారం విశాఖపట్నంలో విజయవంతంగా నిర్వహించబడింది. బీజేపీ రాష్ట్ర మరియు జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు మహారాణిపేట మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ వినూత్న కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి, తమ దీర్ఘకాలిక సమస్యలపై పార్టీ నాయకులకు వినతి పత్రాలను అందజేశారు. ప్రజా ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం, బిజెపి సీనియర్ నాయకులు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల డైరెక్టర్లు, రాష్ట్ర మహిళా నాయకులు మరియు జిల్లా ముఖ్య నాయకులతో కూడిన బృందం విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ను కలిసి ఫిర్యాదులను అందజేసింది. దీనిపై సానుకూలంగా స్పందించిన జాయింట్ కలెక్టర్, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సామాన్యుడి సమస్యే పార్టీ అజెండాగా సాగుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి స్థానిక రెల్లి మహిళలు వి. సత్య భామ, జీ.సునీత,సి.హెచ్.దేవి, ఐ.ఉమ, తదితరులు పాల్గొన్నారు.