అపరిశుభ్రతపై అధికారులకు కఠిన ఆదేశాలు

విశాఖ దక్షిణం, మార్చి:16(స్వతంత్ర ప్రభ)
సౌత్ జోన్ జోనల్ కమిషనర్ ఎం మల్లయ్య నాయుడు పరిధిలోని వార్డ్ నెంబర్ 31 లో ఎల్లమ్మ తోట ఏరియా తనిఖీలో పారిశుధ్యం, డ్రైనేజీ మరియు మౌలిక సదుపాయాల నిర్వహణలో పలు లోపాలు గుర్తించబడిన నేపథ్యంలో సంబంధిత అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది.31వ వార్డులోని ఎల్లమ్మతోట ప్రాంతంలో అధిక సంఖ్యలో ఓపెన్ గార్బేజ్ పాయింట్లు ఉన్నట్లు గుర్తించబడింది. దీనిపై సంబంధిత సానిటేషన్ సిబ్బందికి వెంటనే చర్యలు తీసుకుని ఆ ఓపెన్ గార్బేజ్ పాయింట్లను పూర్తిగా తొలగించి, రోడ్లపై చెత్త వేయకుండా కఠినంగా నియంత్రణ చేపట్టాలని ఆదేశించారు.అలాగే ఎల్లమ్మతోటలో జగదాంబ ప్రాంతం వద్ద ఉన్న టీ టైమ్, యూనిసెక్స్ సలోన్, జగదాంబ థియేటర్ పక్కన ఉన్న పాన్ షాప్,శివ హాట్ పనీపూరి పుష్ కార్ట్,విజయదుర్గ హాట్ స్టాల్ మరియు ఎల్లమ్మ గుడి సమీపంలోని ఇరానీ కేఫ్ వద్ద రోడ్లపై చెత్త వేయడం మరియు కాలువల్లో చెత్త నిల్వ ఉండడం గమనించబడినందున ప్రతి షాప్‌కు ఫైన్ విధించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎల్లమ్మతోటలో సబరగిరి రైస్ షాప్, కిరణ్ షాప్ సమీపంలోని డ్రైన్‌ను కూడా ఓపెన్ చేసి పూర్తిగా శుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు.31వ వార్డులో ఇటీవల నిర్వహించిన వాటర్ పైప్ లైన్ పనులు పూర్తయినప్పటికీ, అనంతరం రోడ్డు పునరుద్ధరణ పనులు జరగకపోవడం గమనించబడింది. దీనిపై సంబంధిత ఇంజినీరింగ్ సిబ్బందిని తక్షణమే రోడ్డు పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.అదేవిధంగా సూర్యబాగ్ ప్రాంతంలోని కమర్షియల్ షాపులు రోడ్లపై షాప్ వ్యర్థాలను వేస్తున్నట్లు గుర్తించబడినందున, అటువంటి షాపులపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి అవసరమైతే ప్రతిరోజూ ఫైన్ విధిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నగరంలో పారిశుధ్యం మరియు ప్రజా ఆరోగ్య పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని, రోడ్లపై చెత్త వేయడం లేదా కాలువలను కలుషితం చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ పర్యటనలో వార్డు ఇన్స్పెక్టర్ మరియు శానిటేషన్ సెక్రటరీలు మరియు మలేరియా సిబ్బంది పాల్గొన్నారు.