వన్ టౌన్, (స్వతంత్ర ప్రభ)
స్థానిక వన్ టౌన్ పరిధిలోని స్వామి వివేకానంద విద్యా సంస్థల వద్ద గోక రమేష్ – భవాని దంపతుల కుమారుడు హేమసుందర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. హేమసుందర్ పుట్టినరోజు సందర్భంగా అక్కడ ఉన్న విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేయడంతో పాటు, పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో గోక కుటుంబ సభ్యులు, మిత్రులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని హేమసుందర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు.