సత్య పోలమాంబ అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు

విశాఖ దక్షిణం,మార్చి;19(స్వతంత్ర ప్రభ)

తెలుగు నూతన సంవత్సరం ‘విశ్వావసు’ సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉగాది సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేడు విశాఖలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో, చల్లని గాలుల మధ్య భక్తులు సౌకర్యవంతంగా ఆలయాలకు చేరుకుంటున్నారు. చెంగలరావుపేటలోని ఆశీపాప వీధి, ఏ.వి.ఎన్. కాలేజీ సమీపాన వెలసిన శ్రీ శ్రీ శ్రీ సత్య పోలమాంబ అమ్మవారి ఆలయంలో భక్తులు ఉదయం నుండే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక పండితులు నూతన సంవత్సర రాశిఫలాలను భక్తులకు వివరించగా, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో షడ్రుచుల ఉగాది పచ్చడి మరియు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. భాగంగా అమ్మవారికి కుంకుమ పూజలు, ప్రత్యేక అర్చనలు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కొత్త ఏడాది భక్తులందరికీ సుఖశాంతులు చేకూరాలని ఆలయ కమిటీ వారు ఆకాంక్షించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *